News February 16, 2026

నిర్మల్‌లో రికార్డ్.. భార్యాభర్తలే ఛైర్మన్, వైస్ ఛైర్మన్

image

నిర్మల్ మున్సిపాలిటీ రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా అప్పాల కావ్య, వైస్‌ ఛైర్మన్‌గా ఆమె భర్త అప్పాల గణేష్ చక్రవర్తి సోమవారం ప్రమాణం చేశారు. ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మున్సిపల్ కీలక పదవులను దక్కించుకోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ బలపరిచిన ఈ జంట ప్రమాణ స్వీకారం చేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Similar News

News March 17, 2026

కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మదనపూర్ 38.2, వెలుగొండ 37.4, వీపనగండ్ల 37.2, పెద్దమందడి, దగడ 36.9, ఆత్మకూరు, వనపర్తి 36.3, అమరచింత, జానంపేట 35.8, శ్రీరంగాపూర్ 35.5, పానగల్, రేమద్దుల, పెబ్బేరు, ఘన్‌పూర్ 35.3, విలియంకొండ 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News March 17, 2026

మెదక్: అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం ఇచ్చిన హరీశ్ రావు

image

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. మాజీ మంత్రి హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి తీర్మానం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు రాక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

News March 17, 2026

BNGR: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

image

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు BNGR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. # SHARE IT