News April 19, 2025
నిర్మల్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News December 18, 2025
SRD: ‘రాజీతో ఇరు వర్గాలు గెలుపొందినట్లే’

క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకోవాడానికి లోక్-అదాలత్ అనేది ఒక మంచి అవకాశమని జిల్లా ఎస్పీ శ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. రాజీ కుదుర్చుకోవడానికి ఈనెల 21న అవకాశం ఉన్న అన్ని కేసుల్లో కక్షిదారులు రాజీపడవచ్చని అన్నారు. అనవసర గొడవలకు పోయి జీవితాలను ఇబ్బందులపాలు చేసుకోకూడదని, రాజీ కుదుర్చుకోవడం ద్వారా ఇరు వర్గాలు గెలుపొందినట్లు అవుతుందన్నారు.
News December 18, 2025
రేగొండ: డబుల్ మర్డర్ కేసులో పదేళ్ల కఠిన కారాగార శిక్ష

రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన డబుల్ మర్డర్ కేసులో ప్రిన్సిపల్ జిల్లా & సెషన్స్ న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో నిందితుడు కంచరకుంట్ల రాజు @ రాజిరెడ్డి(45)ని దోషిగా నిర్ధారించిన న్యాయస్థానం, అతడికి పదేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు, రూ.1,000 జరిమానా విధించింది. ఈ తీర్పుతో నేరాలకు పాల్పడే వారికి కఠిన శిక్షలు తప్పవని, చట్టం ముందు ఎవరూ తప్పించుకోలేరని పోలీసులు స్పష్టం చేశారు.
News December 18, 2025
పలమనేరు: రూ.40 కోట్ల భూమి కబ్జా.?

పలమనేరు నియోజకవర్గంలో మరో భారీ భూ స్కాం ఇది. గంగవరంలోని డ్రైవర్స్ కాలనీ సమీపంలో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు అప్పనంగా కబ్జా చేసినట్లు తెలుస్తోంది. చెన్నై-బెంగళూరు బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న వంక పోరంబోకు భూమిపై అధికారికంగా నిషేధం ఉన్నప్పటికీ, దానిని ప్రైవేట్ భూమిగా మార్చినట్లు సమాచారం. దీని విలువ దాదాపు రూ.40 కోట్లుగా ఉంటుందట. దీనిపై మరింత సమాచారం తెలియాలి.


