News February 21, 2025

నిర్మల్: అగ్నిప్రమాద బాధితులకు అండగా ఉంటాం: కలెక్టర్

image

అగ్ని ప్రమాద బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం పెంబి మండలం రాయదారిలో విద్యుత్ షాట్ సర్క్యూట్ వలన 6 నివాస గృహాలకు అగ్ని ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాద బాధితులకు భోజనం, రాత్రి బస ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ ఘటన సంబంధించి పూర్తి వివరాలు ప్రభుత్వానికి నివేదించడం జరిగిందన్నారు.

Similar News

News November 22, 2025

కాకినాడ: అటవీశాఖ కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన

image

ప్రాజెక్టు వర్క్‌లో భాగంగా కాకినాడకు చెందిన విద్యార్థులు కాకినాడ జిల్లా అటవీశాఖ కార్యాలయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ ఎన్. రామచంద్రరావు వారికి అటవీశాఖ కార్యక్రమాలపై, అలాగే వన్యప్రాణుల సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి, వారి సందేహాలను నివృత్తి చేశారు.

News November 22, 2025

పౌరాణిక, జానపద పాత్రలు నా డ్రీమ్ రోల్స్: రాజీవ్ కనకాల

image

పౌరాణిక, జానపద పాత్రలు పోషించాలన్నదే తన అభిలాష అని సినీ నటుడు రాజీవ్ కనకాల చెప్పారు. పెదపట్నంలంకలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన శనివారం మాట్లాడుతూ.. 225 చిత్రాల్లో నటించానన్నారు. స్టూడెంట్ నెంబర్-1తో పాటు పలు చిత్రాల ద్వారా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. విశ్వంభర, ఆంధ్రా కింగ్, చాయ్‌వాల, తెరచాప, మహేంద్రగిరి, వారాహి విడుదలకు సిద్ధంగా ఉన్నాయని, డ్రాగన్ చిత్రం జనవరిలో ప్రారంభమవుతుందన్నారు.

News November 22, 2025

‘వారణాసి’ బడ్జెట్ రూ.1,300 కోట్లు?

image

రాజమౌళి-మహేశ్‌బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘వారణాసి’ బడ్జెట్ దాదాపు ₹1,300Cr ఉండొచ్చని నేషనల్ మీడియా వెల్లడించింది. ఇప్పటివరకు రూపొందిన భారీ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఇది ఒకటని తెలిపింది. అయితే నితీశ్ తివారి-రణ్‌వీర్ కపూర్ ‘రామాయణం’, అట్లీ-అల్లు అర్జున్ ‘AA22xA6’ మూవీల బడ్జెట్(₹1500Cr-₹2000Cr రేంజ్‌) కంటే ఇది తక్కువేనని పేర్కొంది. కాగా బడ్జెట్‌పై వారణాసి మేకర్స్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనా చేయలేదు.