News March 18, 2025

నిర్మల్ : అగ్ని వీర్ రిక్రూట్మెంట్‌కు దరఖాస్తులు

image

అగ్నిపథ్ స్కీం క్రింద అగ్ని వీర్ రిక్రూట్మెంట్ RTG 2025-26 కొరకు జిల్లాలోని అవివాహిత పురుషులు www.joinindianarmy.nic.in వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని డీఐఈఓ పరశురాం తెలిపారు. మార్చి 12 నుంచి ఏప్రిల్ 10 వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్ లేదా స్టోర్ కీపర్, ట్రేడ్స్ మెన్, వంటి వివిధ కేటగిరీల్లో నియామకాలు జరుగుతాయని పేర్కొన్నారు.

Similar News

News November 25, 2025

బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు!

image

TG: గతంలో పంచాయతీ ఎన్నికల వెంటనే పరిషత్ ఎన్నికలు (MPTC, ZPTC) జరిగేవి. కానీ, ఈసారి పరిషత్ ఎన్నికలను కొంత ఆలస్యంగా నిర్వహించనున్నారు. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోవడంతో ముందుగా సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచే అంశం తేలాక పరిషత్ ఎన్నికలు నిర్వహించనుంది.

News November 25, 2025

జనగామ జిల్లాలో 3 దశల్లో ఎన్నికలు

image

జనగామ జిల్లాలోని 280 పంచాయతీలు, 2534 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో చిల్పూరు, ఘన్పూర్, రఘునాథపల్లి, జఫర్‌గఢ్, లింగాల ఘనపురంలోని 110 జీపీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2వ దశలో జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేటలోని 79 జీపీలకు, 3వ దశలో దేవరుప్పుల, పాలకుర్తి, కొడకొండ్లలోని 91 పంచాయతీలకు జరుగనున్నాయి.

News November 25, 2025

12,735లో బీసీలకు 2,176 గ్రామ పంచాయతీలే!

image

TG: 12,735 గ్రామాలకు గాను 2,176 గ్రామాలే బీసీలకు రిజర్వు అయ్యాయి. ఈ లెక్కన 17.08% రిజర్వేషన్లు అమలు చేశారు. భద్రాద్రి జిల్లాలో 471కి గాను ఒక్కటీ బీసీలకు దక్కలేదు. అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 508కి గాను 136 కేటాయించారు. గత ఎన్నికల్లో BCలకు 20% రిజర్వేషన్లు దక్కినా ఈసారి రొటేషన్ల వల్ల తగ్గినట్లు సమాచారం. అటు BCలకు 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినా కోర్టు కేసులతో సాధ్యం కాలేదు.