News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.
Similar News
News November 28, 2025
ఆధార్ కార్డు బర్త్ సర్టిఫికెట్ కాదు: UP

ఆధార్ కార్డు విషయంలో అన్ని విభాగాలకు ఉత్తర్‌ప్రదేశ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కీలక ఆదేశాలిచ్చింది. ఇకపై ఆధార్ కార్డును బర్త్ సర్టిఫికెట్‌గా, ప్రూఫ్ ఆఫ్ బర్త్‌గా గుర్తించడానికి వీల్లేదని పేర్కొంది. ‘ఆధార్‌కు జనన ధ్రువీకరణ పత్రం జత చేయరు. కాబట్టి ఇకపై దానిని బర్త్ సర్టిఫికెట్‌గా గుర్తించేందుకు వీల్లేదు’ అని ప్లానింగ్ విభాగం ప్రత్యేక కార్యదర్శి అమిత్ సింగ్ బన్సాల్ ఆదేశాలు జారీ చేశారు.
News November 28, 2025
SVU: పీజీలో సీట్లకు స్పాట్ అడ్మిషన్లు

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ (SVU)లో పీజీ (PG) కోర్సుల్లో ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ భూపతి నాయుడు పేర్కొన్నారు. డిసెంబర్ 1వ తేదీన స్పాట్ అడ్మిషన్ల ప్రవేశాల ప్రక్రియ జరుగుతుందన్నారు. ఇందుకు PGCET పాస్ అయిన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో నేరుగా వర్సిటీలో హాజరుకావాలని ఆయన సూచించారు.
News November 28, 2025
శరవేగంగా అమరావతి పనులు: మంత్రి లోకేశ్

AP: రైతుల త్యాగ ఫలితమే అమరావతి అని మంత్రి లోకేశ్ చెప్పారు. గత ప్రభుత్వం దీన్ని విధ్వంసం చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. 3 రాజధానులు అని చెప్పి ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. బ్యాంకులకు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అనే నినాదంతో 1,631 రోజులపాటు రైతులు ఉద్యమం చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి’ అని తెలిపారు.


