News March 31, 2025
నిర్మల్ అదనపు కలెక్టర్ సతీమణికి గ్రూప్-1లో స్టేట్ ర్యాంక్

గ్రూప్-1 ర్యాంకుల ఫలితాల్లో నిర్మల్ అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ సతీమణి ప్రతిభ కనబరిచారు. టీజీపీఎస్సీ ఆదివారం విడుదల చేసిన గ్రూప్-1 పరీక్ష జనరల్ ర్యాంకింగ్‌లో అదనపు కలెక్టర్ సతీమణి బరిరా ఫరీద్ రాష్ట్రస్థాయిలో 68వ ర్యాంకు (బీసీఈ కేటగిరీలో మొదటి ర్యాంకు) సాధించారు. కాగా ఆమె ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ డిగ్రీని పూర్తి చేశారు.
Similar News
News April 23, 2025
పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై కోర్టుకెక్కనున్న మాజీ కోచ్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జాసెన్ గిలెస్పీ పాకిస్థాన్ జట్టుకు గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు వరకు కోచ్‌గా పనిచేశారు. తనకు ఇవ్వాల్సిన జీతాన్ని పాకిస్థాన్ బకాయి పెట్టిందని ఆయన తాజాగా ఆరోపించారు. దానిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయన కాంట్రాక్టును ఉల్లంఘించి నోటీసులు కూడా ఇవ్వకుండా అర్ధాంతరంగా పదవి నుంచి తప్పుకొన్నారని, తామేమీ బకాయిపడలేదని పీసీబీ తెలిపింది.
News April 23, 2025
జనగామ: వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో కమిటీ పాలకవర్గ సమావేశం

జనగామ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో మార్కెట్ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్ అధ్యక్షతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. శివరాజ్ యాదవ్ మాట్లాడుతూ.. ముఖ్యమైన అభివృద్ధి పనులు ఎజెండాగా పెట్టి జనగామ వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని, అదేవిధంగా రైతులకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని పాలక మండలి సభ్యులకు సూచించారు.
News April 23, 2025
వికారాబాద్: జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: స్పీకర్

జిల్లాలో మంచినీటి ఎద్దడి తలెత్తకుండా సరైన విధంగా నీరు అందించాలని తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో వివిధ అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. స్పీకర్ ప్రసాద్ ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ నీరు ప్రతిఇంటికి అందించాలన్నారు.