News April 7, 2025

నిర్మల్: అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

image

మండల ప్రత్యేక అధికారులంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నూతన పథకాలు అమలు, ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయాలలో ఆఫ్ లైన్ విధానంలోనూ దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుదారులకు రసీదును ఇవ్వాలన్నారు.

Similar News

News February 24, 2026

మరికొన్ని గంటల్లో HYDలో భారీ వర్షం

image

నగరంలోని పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరమంతా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఉత్తర, పశ్చిమ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని మ్యాప్ విడుదల చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

News February 24, 2026

శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

image

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.

News February 24, 2026

బాసర ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవోగా విజయరామరావు

image

బాసర జ్ఞాన సరస్వతి ఆలయ ఇన్‌ఛార్జ్ ఈవోగా విజయరామారావు మంగళవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత ఈవో అంజనీదేవి సుదీర్ఘ సెలవుపై వెళ్లడంతో, నిజామాబాద్ అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్న ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. గతంలోనూ ఇక్కడ పనిచేసిన అనుభవం ఉండటంతో ఆలయ వ్యవహారాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఆయన మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మెరుగైన సౌకర్యాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు.