News April 7, 2025
నిర్మల్: అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలి: కలెక్టర్

మండల ప్రత్యేక అధికారులంతా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటించి గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను అందజేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. నూతన పథకాలు అమలు, ఇందిరమ్మ ఇండ్ల మార్కింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఎంపీడీవో కార్యాలయాలలో ఆఫ్ లైన్ విధానంలోనూ దరఖాస్తులను స్వీకరించాలని, దరఖాస్తుదారులకు రసీదును ఇవ్వాలన్నారు.
Similar News
News April 23, 2025
MNCL: RPల నియామకానికి దరఖాస్తులు: DEO

ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్థాయిలో సబ్జెక్ట్, జిల్లా రిసోర్స్ పర్సన్స్ నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు, హెచ్ఎంకు ఈ నెల 24 లోపు దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. ఎంపికైన ఉపాధ్యాయుల వివరాలు 28న ప్రకటిస్తామన్నారు. ఏమనా సందేహాలు ఉంటే క్వాలిటీ కోఆర్డినేటర్ సత్యనారాయణ మూర్తిని 8985209588 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.
News April 23, 2025
ఇలాంటి దాడి దేశంలోనే తొలిసారి!

టెర్రరిజానికి మతం లేదంటారు. కానీ ఇప్పుడు ఉగ్రవాద మూర్ఖత్వానికి మతం ప్రామాణికమైంది. J&K పహల్‌గామ్‌లో మతాన్ని తెలుసుకుని మరీ దాడి చేయడం దేశంలోనే తొలిసారి అని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న జమ్మూకశ్మీర్‌లో మత చిచ్చు రేపి, దాన్ని భారత్ అంతా విస్తరించడమే ఈ దాడి ఉద్దేశమని అంచనా వేస్తున్నారు. పాక్ ప్రేరేపిత లష్కర్ ఏ తొయిబా ఆదేశాలతోనే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ ఘాతుకానికి పాల్పడిందంటున్నారు.
News April 23, 2025
శ్రీరాంపూర్: సింగరేణి మెరిట్ స్కాలర్ షిప్ పెంపు

సింగరేణి ఉద్యోగులకు శుభవార్త.. అర్హత కలిగిన ఉద్యోగుల ఉన్నత చదువుకు ఇప్పటి వరకు యాజమాన్యం అందిస్తున్న ప్రోత్సాహక నగదు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు వివిధ పోటీ పరీక్షల్లో 2 వేలలోపు ర్యాంకు సాధించిన 57 మందికి అందిస్తున్న రూ.10 వేలు మెరిట్ స్కాలర్ షిప్‌ను రూ.16 వేలకు పెంచింది. అలాగే ర్యాంక్ పరిమితి 2 వేలు లోపు నుంచి 8 వేలకు అవకాశం కల్పించారు.