News March 29, 2024

నిర్మల్: అనారోగ్య కారణాలతో యువతి ఆత్మహత్య

image

అనారోగ్యంతో విసిగిపోయి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల(బి) గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన అలగొండ విజయలక్ష్మి(20) బీడీ కార్మికురాలిగా పనిచేసేది. గత ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో విసుగుచెందిన ఆమె ఇంట్లో దూలానికి చున్నీతో ఉరేసుకొని చనిపోయినట్లు SI చంద్రమోహన్ తెలిపారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

Similar News

News November 16, 2025

ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా

image

అదిలాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. బజార్‌హత్నూర్ 8.4°C, పొచ్చర 9, సత్నాల 9.5, సోనాల 9.6, పిప్పల్ దారి 9.8, అర్లి(T) 9.9, ఆదిలాబాద్ అర్బన్ 10.1, తలమడుగు 10.3, రామ్ నగర్ 10.4, భరంపూర్ 10.7, తాంసి 10.8, గుడిహత్నూర్ 11.3, హీరాపూర్ 11.4, సిరికొండ 11.6, ఇచ్చోడ, ఉట్నూర్(X రోడ్) 12.4°C లుగా నమోదయ్యాయి.

News November 15, 2025

EVM గోదాంను పరిశీలించిన ఆదిలాబాద్ కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రం శాంతినగర్‌లోని EVM గోదాంను కలెక్టర్ రాజర్షి షా శనివారం తనిఖీ చేశారు. గోదాంలో భద్రపరిచిన యంత్రాల స్థితి, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరా వ్యవస్థ, బ్యారికేడింగ్ వంటి అంశాలను ఆయన సమగ్రంగా పరీక్షించారు. EVM-VVPATల భద్రతపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండకూడదన్నారు. ప్రతి నెలా నిర్వహణ పద్ధతులను కచ్చితంగా పర్యవేక్షించాలని సంబంధిత శాఖలకు ఆదేశించారు.

News November 15, 2025

నిర్దిష్ట గడువులో పనులు పూర్తి చేయాలి: ADB కలెక్టర్

image

పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ వంటి మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా సంబంధిత అధికారులను ఆదేశించారు. పాఠశాలల మౌలిక సదుపాయాలపై కలెక్టర్ విద్యాశాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు. పాఠశాలల మౌలిక సదుపాయాల పనుల్లో ఏ మాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి పనికి స్పష్టమైన టైమ్‌లైన్‌ ఖరారు చేసి నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు.