News April 16, 2025
నిర్మల్: అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె వర్క్షాప్ నిర్వహించారు. అటవీ భూములపై చేపట్టే అభివృద్ధి పనులకు పరివేశ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News November 10, 2025
అశువు కవిత్వంలో ఆయనకు ఆయనే సాటి

ప్రముఖ కవి, రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ(64) కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తిలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు ఎల్లయ్య. ఆయనకు ముగ్గురు కూతుళ్లు, ఓ కొడుకు. చిన్నతనంలో గొర్రెల కాపరిగా, కూలీగా పనిచేసిన ఆయన.. పట్టుదలతో చదివి రచయితగా ఎదిగారు. అశువు కవిత్వం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. తన పాటలతో తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన సినీ రంగానికి రచయితగా సేవలందించారు.
News November 10, 2025
రాజన్న దర్శనానికి ఇసుకవేస్తే రాలనంత జనం

కార్తీక సోమవారం సందర్భంగా దక్షిణ కాశీ వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసిపోయింది. తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరావడంతో వేములవాడలో ఇసుక వేస్తే రాలదు అన్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది. రాజన్న ఆలయంలో సర్వదర్శనానికి రెండు గంటలకు పైగా సమయం, భీమేశ్వరాలయంలోనూ రెండు గంటలకు పైగా నిరీక్షించాల్సి వస్తోంది.
News November 10, 2025
MBNR: సాఫ్ట్బాల్.. 2nd PLACE

రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ టోర్నమెంట్లో మహబూబ్ నగర్ మహిళా సీనియర్ సాఫ్ట్ బాల్ జట్టు ద్వితీయ స్థానంలో(రజతం) నిలిచింది. తెలంగాణ సాఫ్ట్ బాల్ సెక్రటరీ శోభన్ బాబు చీఫ్ గెస్ట్గా హాజరై జట్టును అభినందించారు. జగిత్యాలలోని ఈ నెల 7 నుంచి 9 వరకు తెలంగాణ రాష్ట్ర స్థాయి సీనియర్ సాఫ్ట్ బాల్ టోర్నమెంట్ జరిగింది. పీడీలు, క్రీడాకారులు పాల్గొన్నారు.


