News April 16, 2025
నిర్మల్: అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి: కలెక్టర్

జిల్లాలో అభివృద్ధి పనుల నిర్వహణలో అటవీ భూముల వినియోగానికి సంబంధించి ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టం మేరకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ చట్టంపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె వర్క్‌షాప్ నిర్వహించారు. అటవీ భూములపై చేపట్టే అభివృద్ధి పనులకు పరివేశ్ పోర్టల్ ద్వారా అనుమతులు పొందాల్సిన అవసరం ఉందన్నారు.
Similar News
News April 19, 2025
ఉండి: మహిళ మెడలో గొలుసు అపహరణ

ఉండి రాజుల పేటలో ఉంటున్న అగ్ని మాత్రం వరలక్ష్మి మెడలోని 4 కాసుల బంగారు తాడును శనివారం గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు. వరలక్ష్మి గత పది సంవత్సరాలుగా ఉండిలో నివాసం ఉంటుంది. శనివారం వేకువజామున 3 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తి డోర్ తీసుకొని వచ్చి అటు ఇటు చూస్తుండగా వరలక్ష్మి ఎవరు అని అడగగా, తన నోరునొక్కి మెడలోని బంగారు తాడును లాక్కెళ్లాడు. పోలీసులు విచారణ చేపట్టారు.
News April 19, 2025
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి: కలెక్టర్

జిల్లాలో అన్ని వరి ధాన్య కొనుగోలు కేంద్రాల్లో సక్రమంగా ధాన్యం సేకరణ చేయాలని, కేంద్రంలో అన్ని సదుపాయాలు కల్పించి, తేమశాతం రాగానే వెంటనే లోడ్ చేసే విధంగా పనిచేయాలని అధికారులను కలెక్టర్ ఎం. మను చౌదరి అదేశించారు. శనివారం నారాయణరావుపేట మండల కేంద్రంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని(ఐకెపి) జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
News April 19, 2025
రాష్ట్రంలోనే ఉష్ణోగ్రతలో టాప్ నేరెళ్ల

జగిత్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఈరోజు ధర్మపురి మండలంలోని నేరెళ్లలో 43.8డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో నేరెళ్ల రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత వారం రోజులుగా ఎండ తీవ్రత భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రజలు మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. వడదెబ్బ తగలకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.