News September 12, 2024
నిర్మల్: అన్నను నరికి చంపిన తమ్ముడు
అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు(35)ను కుటుంబ కలహాల కారణంగా అతడి తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 7, 2024
భవిష్యత్తు కోసం అడవులను కాపాడుకుందాం:ఎఫ్ఆర్ఓ
భవిష్యత్తు కోసం అడవులను, వన్యప్రాణులను కాపాడుకుందామని కడెం మండలంలోని ఉడుంపూర్ ఎఫ్ఆర్ఓ అనిత సూచించారు. 70వ అటవీ సంరక్షణ వారోత్సవాలలో భాగంగా సోమవారం ఉడుంపూర్ పరిధిలోని అటవీ ప్రాంతాలలో ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు ఉంటేనే మనిషికి మనుగడ ఉంటుందన్నారు. వాటిని కాపాడుకుందామని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.
News October 7, 2024
బెజ్జూర్: ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళా మృతి
ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందింది. ఏఎస్ఐ మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. లంబాడిగూడకు చెందిన అల్లూరి లక్ష్మీ వ్యవసాయ పనుల నిమిత్తం పొలంకు వెళ్లింది. నీళ్లు తీసుకువచ్చే క్రమంలో కాలుజారి బావిలో పడి మృతి చెందింది. భర్త లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.
News October 7, 2024
యోగా ఛాంపియన్షిప్‌లో జాతీయస్థాయికి బాసర విద్యార్థులు
TYSA ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా పటాన్‌చెవులో జరిగిన ఐదో రాష్ట్ర స్థాయి యోగా పోటీలలో నిర్మల్ జిల్లా బాసరకు చెందిన చరణ్, అవినాశ్ జాతీయస్థాయికి ఎంపికైనట్లు సోమవారం నిర్మల్ జిల్లా యోగా అసోసియేషన్ జనరల్ సెక్రటరీ మల్లేశ్ తెలిపారు. ఇందులో అవినాష్ జాతీయ స్థాయికి ఎంపిక కావడం ఇది ఐదో సారి అని తెలిపారు. విద్యార్థులకు పలువురు అభినందించారు.