News February 20, 2025
నిర్మల్: అభ్యంతరాల స్వీకరణ గడువు పొడగింపు

వైద్య కళాశాలలో ఖాళీల భర్తీకి చేపట్టిన నియామకాల దరఖాస్తులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 24 వరకు పెంచినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా వైద్య కళాశాలలో పొరుగు సేవల పద్ధతిన 32 ఖాళీల భర్తీ నియామక ప్రక్రియలో భాగంగా అర్హులైన అభ్యర్థులపై అభ్యంతరాల స్వీకరణ గడువు ఈనెల 20 నుంచి 24వ వరకు పొడిగించినట్లు తెలిపారు.
Similar News
News December 16, 2025
విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత.. విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రీజినల్లో ఉన్న బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు, సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.
News December 16, 2025
క్రికెటర్ శ్రీ చరణికి గ్రూప్-1 పోస్ట్.. కడపలో ఇంటి స్థలం

ఆర్టీపీపీకి చెందిన ప్రపంచ కప్ విజేత శ్రీచరణికి ఏపీ ప్రభుత్వం రూ. 2.50కోట్ల నగదు, పురస్కారం అందజేసిన విషయం తెలిసిందే. కాగా ఆమెకు కడప నగరంలో 1000 గజాల ఇంటి స్థలం కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా ఆమెకు గ్రూప్-1 హోదా ఉద్యోగాన్ని కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
News December 16, 2025
గుంటూరులో అదృశ్యం.. హైదరాబాద్లో ప్రత్యక్షం

గుంటూరులో అదృశ్యమైన ఇద్దరు బాలురు హైదరాబాద్లో ప్రత్యక్షమయ్యారు. లాలాపేటకు చెందిన రెహమాన్ బాషా, నరసరావుపేటకు చెందిన జవాద్ మల్లారెడ్డి నగర్ మెట్టు అంజిరెడ్డి కళ్యాణ మండపంలో జరుగుతున్న ఫంక్షన్ వచ్చి ఈ నెల 14న అదృశ్యమయ్యారు. అయితే రహమాన్ బాషా తల్లిదండ్రులు గొడవల కారణంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్లో ఉంటున్న తల్లి వద్దకు రహమాన్ తన స్నేహితుడు జావాద్ని కూడా వెంట పెట్టుకొని వెళ్లాడు.


