News February 12, 2026
నిర్మల్: అభ్యర్థులకు నేడు జాగారం.. రేపు మహాశివరాత్రి

జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. శుక్రవారం కౌంటింగ్ నిర్వహించనుండటంతో అభ్యర్థులు నేడు జాగారం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రచారంలో శ్రమించి, భారీగా ఖర్చు చేసిన నేతలు.. ఇప్పుడు ఓటరు నాడి ఎటువైపు ఉందోనని ఆందోళన చెందుతున్నారు. గెలిచిన వారికి రేపే మహాశివరాత్రి పర్వదినం ముందుగా వచ్చినట్లవుతుందని పట్టణంలో చర్చ సాగుతోంది.
Similar News
News March 6, 2026
భద్రాద్రిలో వైభవంగా రామయ్య నిత్య కళ్యాణం

భద్రాద్రి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో శుక్రవారం నిత్య కళ్యాణ వేడుక కనులపండువగా జరిగింది. తెల్లవారుజామున గర్భాలయంలో స్వామివారికి సుప్రభాత సేవ, ఆరాధనలు నిర్వహించిన అనంతరం, ఉత్సవ మూర్తులను బేడా మండపానికి తీసుకొచ్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా విశ్వక్సేన పూజ, కంకణధారణ గావించి సీతారాముల కల్యాణాన్ని జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణం వీక్షించి తరించారు.
News March 6, 2026
అనకాపల్లి: ఇంటర్ పరీక్షకు 208 మంది గైర్హాజర్

అనకాపల్లి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షకు 208 మంది విద్యార్థులు గైర్హాజర్ అయినట్లు డీఐఈవో వినోద్ బాబు తెలిపారు. 6,575 మంది హాజరు కావలసి ఉండగా 6,367 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. పరీక్షలు పకడ్బందీగా, ప్రశాంతంగా జరుగుతున్నాయన్నారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు.
News March 6, 2026
తుఫానులకు నష్టం జరగకుండా చర్యలు: హోంమంత్రి

భవిష్యత్తులో వచ్చే తుఫానులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం శాసనమండలిలో మాట్లాడుతూ 2014-19 మధ్య సీఎం చంద్రబాబు 219 తుఫాన్ షెల్టర్లను నిర్మించినట్లు పేర్కొన్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో ఒక్కటి కూడా నిర్మించలేదన్నారు. పైగా డిజాస్టర్ మేనేజ్మెంట్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు.


