News September 26, 2024
నిర్మల్: అరెస్టు అయిన ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెండ్

నిర్మల్ జిల్లాకి చెందిన ఉపాధ్యాయులు దాసరి రమేశ్, వెంకటేశ్ గౌడ్‌ను బిట్ కాయిన్/క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై స్పందించి డీఈవో రవీందర్ రెడ్డి వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Similar News
News December 22, 2025
మంత్రి జూపల్లి కృష్ణారావును కలిసిన జోగు రామన్న

ఆదిలాబాద్ ఇన్‌ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును సోమవారం హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో మాజీ మంత్రి జోగురామన్న కలిశారు. గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తిచేయాలని కోరారు. అదేవిధంగా చనాక కొరాట ప్రాజెక్టుకు సంబంధించి పనులను త్వరగా పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విన్నవించినట్లు జోగురామన్న తెలిపారు.
News December 21, 2025
ఆదిలాబాద్: సోమవారం ప్రజావాణి యథాతథం

ఈ సోమవారం (22 వ తేదీ) నుంచి ప్రజావాణి కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్నందున ఇన్ని రోజులు వాయిదా పడిన ప్రజావాణి కార్యక్రమం సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతుందన్నారు. ప్రజలు ఎవరైనా తమ సమస్యల గురించి దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
News December 20, 2025
బ్లాక్ మెయింగ్‌కి పాల్పడితే సంప్రదించండి: ADB SP

మహిళలకు గతంలో జరిగిన వాటిని అడ్డుగా పెట్టుకుని బ్లాక్మెయిలింగ్ పాల్పడుతున్న సందర్భాలలో నిర్భయంగా షీ టీం బృందాన్ని సంప్రదించవచ్చని SP అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. గతంలో ప్రేమించి, ప్రస్తుతం ఆ యువకులచే వేధింపబడుతున్న మహిళలు నిర్భయంగా సంప్రదించాలని సూచించారు. షీ టీం అండగా ఉంటూ సహాయాన్ని అందజేస్తుందని హామీ ఇచ్చారు. ఆపద వస్తే 8712659953 నంబర్‌కు సంప్రదించాలన్నారు.


