News February 14, 2025

నిర్మల్: ‘అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలి’

image

అలేఖ్య కేసులో మిగిలిన వారికి కూడా శిక్ష పడాలని కోరుతూ బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలను వారి కార్యాలయంలో కలిసి విన్నవించారు. బాధితులు మాట్లాడుతూ.. అలేఖ్య హత్య కేసులో నిందితుడికి బుధవారం కోర్టు శిక్ష విధించిందని, అందుకు కారణమైన మిగతా ఇద్దరికీ శిక్షపడేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్పీ స్పందిస్తూ హైకోర్టులో అపీలు చేస్తామని తెలిపారు.

Similar News

News December 4, 2025

చెల్పూర్, గొర్లవీడు సర్పంచుల బరిలో తాజా మాజీ ఎంపీపీలు..!

image

జయశంకర్ జిల్లాలో తాజా మాజీ ఎంపీపీలు ఇరువురు సర్పంచ్ బరిలో నిలిచారు. గణపురం మండల తాజా మాజీ ఎంపీపీ కావటి రజిత చెల్పూరు సర్పంచ్, భూపాలపల్లి తాజా మాజీ ఎంపీపీ మందల లావణ్య రెడ్డి గొర్లవీడు సర్పంచ్ బరిలో నిలిచారు. వీరిరువురు మండల స్థాయిలో ఎంపీపీలుగా పనిచేసి జనరల్ మహిళల రిజర్వేషన్ల రావడంతో వారి సొంత గ్రామాల్లో పోటీకి నిలిచారు. అందులో రజిత అధికార కాంగ్రెస్, లావణ్య ప్రతిపక్ష బీఆర్ఎస్‌లో ఉన్నారు.

News December 4, 2025

ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటాం: పవన్

image

AP: కాకినాడ(D) ఉప్పాడ మత్స్యకారులను ఆదుకుంటామని వారితో సమావేశం సందర్భంగా Dy.CM పవన్ అన్నారు. ‘సముద్ర జలాల కాలుష్య సమస్యపై శాస్త్రీయ పరిశోధన చేస్తాం. జాలర్ల ఆదాయం పెంపు, మత్స్య సంపద వృద్ధి, తీర ప్రాంత రక్షణ, యువత, మహిళలకు ఉపాధి కల్పన లక్ష్యంగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నాం. గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రజాధనం వృథా అయింది. చేసిన పనులే చేయాల్సిన దుస్థితిని అప్పటి పాలకులు తెచ్చారు’ అని ఆరోపించారు.

News December 4, 2025

జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

image

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.