News February 26, 2025
నిర్మల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ ఉద్యోగాలు

నిర్మల్ ఆర్టీసీ డిపోలో కాంట్రాక్టు విధానంలో పని చేయడానికి డ్రైవర్లు కావాలని నిర్మల్ డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. హెవీ లైసెన్స్ ఉండి బ్యాడ్జి నెంబర్ ఉన్న 18 నెలల అనుభవం కల డ్రైవర్లు కావాలని చెప్పారు. వరంగల్లోని ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్లో 15 రోజుల శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకుంటామని పేర్కొన్నారు. నెలకు జీతం రూ.24 వేలు ఉంటుందని, ఆసక్తి గలవారు డిపోలో సంప్రదించాలని సూచించారు.
Similar News
News October 20, 2025
ఆకాశంలో కనువిందు చేసిన ఇంద్ర ధనస్సు

NTR (D) వీరులపాడు (M) రంగాపురం శివారులో ఆకాశంలో ఇంద్ర ధనస్సు కనువిందు చేసింది. గ్రామంలో సాధారణ నుంచి మోస్తరు చిరుజల్లులు ప్రారంభమయ్యాయని, ఆ సమయంలో ఏర్పడిన ఇంద్ర ధనస్సు చూపరులను ఆకట్టుకుందని స్థానికులు తెలిపారు. గ్రామానికి దగ్గరలోని అటవీ ప్రాంతం ఉండడంతో కొండ ప్రాంతం సైతం పచ్చటి వాతావరణం నెలకొందని స్థానికులు అన్నారు.
News October 20, 2025
మేం మొదలుపెడితే తట్టుకోలేరు.. కేతిరెడ్డిపై జేసీ ఫైర్

AP: ధర్మవరం మాజీ MLA కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. ‘ఇదే మీకు లాస్ట్ దీపావళి అని కేతిరెడ్డి అంటున్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మేం మొదలుపెడితే మీరెవరూ తట్టుకోలేరు’ అని ఫైరయ్యారు. ఆయన ఆలోచించి మాట్లాడాలని, భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎప్పటికీ ఎమ్మెల్యే కాలేరని అన్నారు.
News October 20, 2025
NZB: రియాజ్ మృతిపై ప్రమోద్ కుటుంబం హర్షం

నిజామాబాద్ జిల్లాలోని కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసు నిందితుడు రియాజ్ మృతి పట్ల ఆయన భార్య ప్రణీత భావోద్వేగానికి లోనై ఆనందం వ్యక్తం చేశారు. త్వరితగతిన స్పందించిన పోలీసు శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ప్రమోద్ మృతికి న్యాయం జరిగిందని, రౌడీ షీటర్లను ఏరిపారేయాలని ఆమె కోరారు. ప్రమోద్ సోదరి మాధవి, గూపన్పల్లి గ్రామస్థులు సైతం పోలీసుల చర్యను హర్షించారు.