News March 20, 2025

నిర్మల్: ఆ గురువులే కీచకులు

image

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులే విద్యార్థుల పట్ల కీచకంగా మారుతున్నారు. నిర్మల్(D) నర్సాపూర్ (జి)లో గణిత ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించి అరెస్టు అయ్యాడు. విద్యార్థినుల తల్లిదండ్రులు వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జడ్పీ స్కూల్, సాయికుంట ఆశ్రమ పాఠశాల, భీమిని పాఠశాలలో కూడా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి.

Similar News

News March 28, 2025

చేవెళ్ల సబ్ రిజిస్ట్రార్‌కు సాహిత్య అకాడమీ అవార్డు

image

చేవెళ్ల సబ్‌ రిజిస్ట్రార్‌ డాక్టర్‌ దాసరి వెంకటరమణకు అరుదైన గౌరవం దక్కింది. 2014లో ఆయన రాసిన ఆనందం అనే కథల సంపుటిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఇదే కథల సంపుటిని షోలాపూర్‌కు చెందిన బుధవారం రేణుక ‘ఆనందం’ పేరుతో మరాఠీలోకి అనువాదం చేశారు. కథల సంపుటిలోని ఆనంద అనే మొదటి కథను మహారాష్ట్రలోని షోలాపూర్‌ విశ్వవిద్యాలయంలో బీఏ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఈ ఏడాది ఎంపిక చేశారు.

News March 28, 2025

మండపేట: అధిష్ఠానంపై తోట అలిగారా..!

image

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అధిష్ఠానంపై అలిగారని పార్టీ క్యాడర్‌లో వదంతులు చక్కెర్ల కొడుతున్నాయి. 25 ఏళ్ల సీనియర్ నాయకుడు అయిన తనను కాదని కాకినాడ జిల్లా అధ్యక్ష పదవిని రాజాకు కట్టబెట్టడంపై అగ్రహంగా ఉన్నారని గుసగసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఉత్తరాంధ్ర కో ఆర్డీనేటర్‌గా కన్నబాబుని పదవి వరించింది. దీనితో తనను నిర్లక్ష్యం చేస్తుండటంతో తటస్థంగా ఉంటున్నారని సన్నిహత వర్గాల్లో చర్చనీయంశంగా మారింది.

News March 28, 2025

KNR: రేషన్‌షాపుల్లో సన్నబియ్యం.. అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్

image

రాష్ట్ర ప్రభుత్వం ఉగాది నుంచి రేషన్‌షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేయనుంది. దీంతో కరీంనగర్ జిల్లా 2,77,323 మంది లబ్ధిదారులకు లబ్ధి జరగనుంది. ఇది వరకు రేషన్‌షాపుల్లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేవారు. దీంతో చాలామంది లబ్ధిదారులు వాటిని అమ్ముకునేందుకు మొగ్గుచూపే వారు. ఇక నుంచి సన్నబియ్యం రేషన్ షాపుల్లో పంపిణీ చేయనుండటంతో రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సెల్ఫ్ బ్రేక్ పడినట్టయ్యింది.

error: Content is protected !!