News August 13, 2024
నిర్మల్: ఆ విషయంలో ప్రత్యేకత చాటుకుంటున్న నిర్మల్

మహిళా జనాభా ఎక్కువగా ఉన్న నిర్మల్ జిల్లా మరో విషయంలోనూ ప్రత్యేకత చాటుకుంటోంది. జిల్లాలోని పరిపాలన యంత్రాంగంలో ఎక్కువ మంది మహిళా అధికారులే ఉండడం విశేషం. అత్యంత కీలకమైన కలెక్టర్, ఎస్పీ, డీఆర్డీఓ, ఆర్డీఓ పోస్టుల్లో మహిళా అధికారులే బాస్‌లుగా వ్యవహరిస్తున్నారు. కలెక్టర్‌గా అభిలాష అభినవ్, ఎస్పీగా జానకీ షర్మిల, డీఆర్డీఓగా విజయలక్ష్మి, ఆర్డీవోగా రత్న కల్యాణి ఇలా అత్యధికులు మహిళలే ఉన్నారు.
Similar News
News February 22, 2026
ఆదిలాబాద్ ‘బడా’ నేతలకు తప్పని భంగపాటు

ADB మున్సిపల్ ఎన్నికల్లో ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న’ నానుడి ప్రధాన పార్టీల నేతల విషయంలో తలకిందులైంది. మాజీ మంత్రి జోగు రామన్న తన కుమారుడిని 34వ వార్డులో గెలిపించుకోలేకపోయారు. అలాగే కాంగ్రెస్ నేత శ్రీనివాస్ రెడ్డి, గండ్రత్ సుజాత, బీజేపీ నేత సుహాసిని రెడ్డి తమ సొంత వార్డుల్లోనే అభ్యర్థులను గెలిపించుకోవడంలో విఫలమయ్యారు. దిగ్గజ నేతల ఇలాకాలో ఓటమి జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
News February 22, 2026
ఆదిలాబాద్ : రేపు యథాతథంగా ‘ప్రజావాణి’

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్‌తో పాటు అన్ని మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో సోమవారం ‘ప్రజావాణి’ కార్యక్రమం యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ప్రజలు చిన్నపాటి సమస్యల కోసం జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, మండల కేంద్రాల్లోనే ఫిర్యాదులు చేయవచ్చని సూచించారు. సమాచార సహాయక కేంద్రాల ద్వారా డిజిటల్ పద్ధతిలో ఫిర్యాదులను నమోదు చేసి, సత్వర పరిష్కారం చూపుతామని పేర్కొన్నారు.