News March 22, 2025
నిర్మల్: ఇంటి వద్దకే రాముల వారి తలంబ్రాలు

ఏప్రిల్ 6న శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో జరగనున్న సీతారామచంద్రస్వామి కళ్యాణంలో వినియోగించిన తలంబ్రాలను ఆర్టీసీ కార్గో ద్వారా అందించనున్నట్లు డిపో మేనేజర్ పండరి తెలిపారు. శనివారం పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. భద్రాచలం వెళ్లలేని భక్తులు బస్టాండ్లో ఏర్పాటుచేసిన కౌంటర్లో రూ.151 చెల్లిస్తే వారి ఇంటి వద్దకే తలంబ్రాలను పంపిస్తామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News November 15, 2025
కలియుగ ధర్మ సూత్రమిదే..

ఈ కలియుగంలో నీ గతం ఎంత గొప్పదైనా నీవు చేసిన ఒక్క తప్పును జనం చెడుగానే పరిగణిస్తారు. వంద మంచి పనులు చేసినా, ఒక చిన్న లోపం కనిపిస్తే, లోకం నిన్ను చెడ్డవానిగా ముద్రవేస్తుంది. అదేవిధంగా నీ గతం ఎంత చెడ్డదైనా, చిత్తశుద్ధితో చేసిన ఒక్క మంచి పని అయినా నిన్ను మంచివానిగా నిలబెట్టగలదు. అందుకే జనాభా అభిప్రాయాలకు లొంగకుండా, వర్తమానంలో ధర్మాన్ని ఆచరించడమే నిజమైన జీవిత నిబంధనగా ముందుకు సాగాలి.
News November 15, 2025
తూ.గో: సదరం క్యాంపులు ప్రారంభం

తూ.గో జిల్లా వ్యాప్తంగా కొత్త సదరం సర్టిఫికెట్ల జారీ కోసం స్లాట్ బుకింగ్ శుక్రవారం నుంచి ప్రారంభమైందని DCHS డా.ఎం.పద్మ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతి సోమవారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో, ప్రతి మంగళవారం ఏరియా హాస్పిటళ్లు, జిల్లా ఆసుపత్రులు, GGHల్లో సదరం సర్టిఫికెట్ల కోసం స్క్రీనింగ్ పరీక్షలు చేస్తామని చెప్పారు.
News November 15, 2025
సిద్దిపేట: C-section ప్రసవాలను తగ్గించాలి: కలెక్టర్

C- సెక్షన్ ప్రసవాలను తగ్గించాలని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. శుక్రవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న వైద్య అధికారులతో ప్రజలకు అందిస్తున్న వివిధ ఆరోగ్య సేవల పైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా పూర్వ డెంగ్యూ కేసుల ఫాలో అప్ నిర్వహణ పైన రివ్యూ నిర్వహించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.


