News February 5, 2025

నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

image

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News December 13, 2025

తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి ధర భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ.5వేలు తగ్గి రూ.2,10,000కి చేరింది. అటు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.270 తగ్గి రూ.1,33,910గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.250 తగ్గి రూ.1,22,750కి చేరింది.

News December 13, 2025

తిరుపతి: కొత్తగా 1,251 ఉద్యోగాలు.!

image

నాయుడుపేటలోని MP SEZలో PCB తయారీ యూనిట్ ఏర్పాటుకు CIPSA TEC India Pvt Ltdకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకోసం 20 ఎకరాల భూమిని 75% రాయితీతో ఆ సంస్థకు కేటాయించింది. రూ.1,140 కోట్ల పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టుతో ద్వారా 1,251 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇది ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మానుఫ్యాక్చరింగ్ పాలసీ 4.0 కింద తొలి 10 ప్రాజెక్టుల్లో ఒకటిగా నిలిచి ప్రోత్సాహకాలను అందుకోనుంది.

News December 13, 2025

జుట్టుకు బలాన్నిచ్చే విటమిన్లివే..!

image

ప్రస్తుతకాలంలో కాలుష్యం, వాతావరణ మార్పుల వల్ల చాలామంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే ఆహారంలో ఈ విటమిన్లుండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు. విటమిన్ బి7, విటమిన్ డి, ఐరన్, జింక్, విటమిన్ ఈ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ ఏ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో పాటు జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నీరు తాగడం వంటివి చేస్తే పట్టులాంటి జుట్టు సొంతమవుతుందంటున్నారు.