News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న<<15345603>> ఉపాధ్యాయులపై <<>>పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
భీమవరం: ‘సీబీ-సీఐడీ’ పేరుతో మోసం

భీమవరం పట్టణానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి శర్మ సైబర్ మోసగాళ్ల వలలో చిక్కుకొని రూ.78 లక్షలు పోగొట్టుకున్నారు. గత నెల 27న సీబీ-సీఐడీ అధికారులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, సిమ్ సమస్యను పరిష్కరించడానికి ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు అడిగారని ఆయన తెలిపారు. వారి మాటలు నమ్మి వివరాలు చెప్పడంతో, తన ఖాతా నుంచి దఫదఫాలుగా రూ.78 లక్షలను మాయం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఎన్టీఆర్ జిల్లాలో 1,600 MSME యూనిట్ల లక్ష్యం

ఎన్టీఆర్ జిల్లాలో ఈ ఏడాది రూ.260 కోట్లతో 1,600 ఎంఎస్ఎంఈ యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా పరిశ్రమల CGM ఎం. మధు తెలిపారు. వీటి ద్వారా 8,500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఇప్పటికే 997 యూనిట్లతో 5,045 మందికి ఉపాధి కల్పించామని, మిగిలిన లక్ష్యాన్ని ఆర్థిక సంవత్సరం చివరిలోపు చేరుకుంటామని స్పష్టం చేశారు.