News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న<<15345603>> ఉపాధ్యాయులపై <<>>పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News January 14, 2026
కడప జిల్లా TDP MLAకి బెదిరింపులు

మైదుకూరు MLA సుధాకర్ యాదవ్‌తో పాటు అతని కుమారుడు ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్ యాదవ్‌ను బెదిరించిన కేసులో ముంబయికి చెందిన నిందితుడు రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. RTI కార్యకర్తనని, ఆస్తులను జప్తు చేస్తానని ఈ-మెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. రూ.10 కోట్లు ఇస్తే వదిలి పెడతానని MPని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు దక్షిణ ముంబయిలో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు.
News January 14, 2026
ఇంటర్ ఫస్టియర్‌లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్స్!

ఇంటర్ పూర్తయ్యాక నిర్వహించే ఎంట్రన్స్ ఎగ్జామ్స్‌ను ఫస్టియర్/11వ తరగతిలోనే జరిపే ప్రతిపాదనపై కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ కసరత్తు చేస్తోంది. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి తగ్గించడం, కోచింగ్ సెంటర్ల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు ఈ దిశగా ఆలోచిస్తోంది. అలాగే ఇంటర్ పరీక్షలను మల్టిపుల్ ఛాయిస్ తరహా విధానంలో నిర్వహించడం, బోర్డు పరీక్షల్లో వచ్చిన మార్కులకు వెయిటేజీ ఇవ్వడంపైనా ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది.
News January 14, 2026
ఏలూరు MPకి బెదిరింపులు.. రూ.10 కోట్లు డిమాండ్

ఏలూరు MP పుట్టా మహేశ్‌తోపాటు ఆయన తండ్రి మైదుకూరు MLA సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన కేసులో ముంబయికి చెందిన నిందితుడు రుషాంత్ జయకుమార్ వాడ్కేను పోలీసులు అరెస్ట్ చేశారు. RTI కార్యకర్తనని, ఆస్తులను జప్తు చేస్తానని ఈ-మెయిల్స్ ద్వారా నిందితుడు బెదిరింపులకు దిగాడు. రూ.10 కోట్లు ఇస్తే వదిలి పెడతానని MPని బెదిరించిన కేసులో నిందితుడిని పోలీసులు దక్షిణ ముంబయిలో అరెస్ట్ చేసి కడప జైలుకు తరలించారు.


