News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI
నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.
Similar News
News February 5, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్లో 1109 మంది అరెస్టు
కామారెడ్డి జిల్లాలో మద్యం సేవించి జనవరి నెలలో 1109 మంది వాహనదారులు పట్టుబడినట్లు ఎస్పీ సింధుశర్మ తెలిపారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టపరమైన జరిమానాలు విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూదని తల్లిదండ్రులకు ఎస్పీ సింధుశర్మ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
News February 5, 2025
కాగజ్నగర్లో దేశీదారు స్వాధీనం
కాగజ్నగర్లో బుధవారం దేశీదారు బాటిల్స్ పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ రవి తెలిపారు. అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు దాడులు నిర్వహించామన్నారు. దేశీ దారు స్వాధీనం చేసుకొని రత్నం శ్రీకాంత్, వోగ్గు దివాకర్ పై కేసు నమోదు చేసినట్లు సీఐ వెల్లడించారు.
News February 5, 2025
కాళేశ్వరంలో కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతీ పుష్కరాల ఏర్పాట్ల పరిశీలన
కాళేశ్వరం గ్రామంలో గోదావరి తీరాన్ని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖరే బుధవారం పరిశీలించారు. కుంభాభిషేకం, మహాశివరాత్రి, సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డితో కలిసి పరిశీలించారు. వాహనాలకు సరైన పార్కింగ్ ఉండే విధంగా, ట్రాఫిక్ జామ్ కాకుండా, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో చర్చించారు. పలువురు ఎస్సైలు, సీఐలు పాల్గొన్నారు.