News February 5, 2025

నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI

image

నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్‌వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.

Similar News

News January 15, 2026

రాజాసాబ్ నిర్మాతతో పవన్ కొత్త ప్రాజెక్టులు

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌తో ఆయన భేటీ అయ్యారు. ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’, ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ కాంబినేషన్‌లో రాబోయే చిత్రాలపై ఇద్దరూ విస్తృతంగా చర్చించారు. కథలు, కంటెంట్‌, కొత్త ఆలోచనలపై చర్చలు కొనసాగినట్లు PKCW వెల్లడించింది. బలమైన, అర్థవంతమైన కథలను అందించడమే లక్ష్యమని విశ్వప్రసాద్ తెలిపారు.

News January 15, 2026

విశాఖలో ఎగబాగుతున్న భూముల ధరలు(1/2)

image

విశాఖలో భూముల ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. భోగాపురం ఎయిర్ పోర్ట్ పూర్తికావడం, ఆనందపురంలో గూగుల్ డేటా సెంటర్ రాక, మధురవాడ–కాపులుప్పాడ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వేగం పుంజుకోవడంతో రియల్‌ ఎస్టేట్ డిమాండ్ గణనీయంగా పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగులు విశాఖకు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా గృహావసరాలు, కమర్షియల్ స్పేస్‌పై డిమాండ్ మరింత పెరిగే పరిస్థితి కనిపిస్తోంది.

News January 15, 2026

విశాఖలో ఎగబాగుతున్న భూముల ధరలు(2/2)

image

చాలా ప్రాంతాల్లో గజం రూ.5 నుంచి 10 వేలు, కమర్షియల్ అయితే గజం రూ.30 వేలు వరకు పెరిగింది. ఈ పరిణామాలు స్టాంపులు రిజిస్ట్రేషన్ల ఆదాయంలోనూ ప్రతిబింబిస్తున్నాయి. జిల్లాలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ గతేడాది APR నుంచి DEC వరకు సుమారు రూ.800 కోట్ల ఆదాయం సమకూర్చుకుంది. ఇందులో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్ ఆఫీస్ రూ.200.58 కోట్లు, సూపర్ బజార్ రూ.172 కోట్లు, గాజువాక కార్యాలయం రూ.86.28 కోట్ల ఆదాయాన్ని సాధించాయి.