News August 8, 2024

నిర్మల్: ఈనెల 12న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్స్

image

నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 12న స్పాట్ అడ్మిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ రమేశ్ తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలతో ఈనెల 11వ తేదీలోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

Similar News

News December 12, 2025

మొదటి విడతలో ఎన్నికల్లో 15 కేసులు: ADB SP

image

మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనలో 15 కేసులు నమోదైనట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. ఉట్నూర్, నార్నూర్, ఇచ్చోడ, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్లలో మొత్తం 50 మంది వ్యక్తులపై 15 కేసులు నమోదు చేశామన్నారు. రెండు రోజుల్లో 15 నిబంధనల ఉల్లంఘన కేసులు, విజయోత్సవ ర్యాలీలు నిర్వహించిన 5 బృందాలపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News December 12, 2025

ADB: రేపు అన్ని పాఠశాలలకు వర్కింగ్ డే

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు రెండవ శనివారం పని దినంగా ఉంటుందని జిల్లా ఇన్‌ఛార్జ్ డీఈఓ రాజేశ్వర్ తెలిపారు. కొమరం భీమ్ వర్ధంతి సందర్భంగా అక్టోబర్ 7న సెలవు ప్రకటించినందుకు బదులుగా ఈ నెల 13న అన్ని పాఠశాలలు యథావిధంగా పనిచేయాలని సూచించారు. అన్ని పాఠశాలలు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News December 11, 2025

హీరాపూర్‌: కోడలిపై అత్త విజయం

image

ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో అత్తాకోడళ్లు తలపడిన విషయం తెలిసిందే. ఈ రసవత్తర పోరులో అత్త తొడసం లక్ష్మీబాయి, కోడలు తొడసం మహేశ్వరిపై విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన లక్ష్మీబాయి 140 ఓట్ల తేడాతో గెలుపొందారు.