News February 15, 2025

నిర్మల్: ఈనెల 17న ఇసుక నిల్వలకు వేలం

image

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ కాలనీలో ఇటీవల అక్రమంగా నిల్వ ఉంచిన 35 ట్రాక్టర్ల ఇసుకను రెవెన్యూ, పోలీసులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఇసుకను వేలం వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఇసుక వేలంలో పాల్గొనేవారు రూ.2 వేల రూపాయల రుసుము చెల్లించి ఈనెల 17న ఉదయం 11 గంటలకు నిర్వహించే టెండర్లలో పాల్గొనాలని తెలిపారు.

Similar News

News November 20, 2025

‘కొదమసింహం’ నాకు, చరణ్‌కు ఫేవరేట్ మూవీ: చిరంజీవి

image

తనకు కౌబాయ్ మూవీస్ అంటే ఇష్టమని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ‘కొదమసింహం సినిమాలో నా స్టిల్ చాలా పాపులర్. తొలిసారి నేను గడ్డం పెంచి నటించిన సినిమా ఇది. నాకు, రామ్ చరణ్‌కు ఫేవరేట్ మూవీ’ అని తెలిపారు. కొదమసింహం సినిమాను ఈ నెల 21న రీ రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రీమియర్ షో, ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సినిమాతో తనకున్న అనుబంధాన్ని వీడియో ద్వారా చిరంజీవి గుర్తుచేసుకున్నారు.

News November 20, 2025

భార్యను వేధించిన భర్తకు ఏడాది జైలు శిక్ష: DSP

image

విజయనగరం మహిళా పోలీసు స్టేషన్‌లో 2022లో నమోదైన వేధింపుల కేసులో నిందితుడు కలిశెట్టి వీరబాబుకు ఏడాది జైలు శిక్ష, రూ.500 జరిమానా విధించినట్లు DSP గోవిందరావు తెలిపారు. భార్య సుజాత ఫిర్యాదు మేరకు మద్యం మత్తులో శారీరక, మానసిక వేధింపులు చేసిన భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు పూర్తి చేశామన్నారు. సాక్ష్యాలు రుజువుకావడంతో JFCM స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి పి. బుజ్జి శిక్ష ఖరారు చేశారని చెప్పారు.

News November 20, 2025

నితీశ్ రికార్డు.. బిహార్ సీఎంగా పదోసారి

image

బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. రికార్డు స్థాయిలో 10వ సారి ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 2000 మార్చిలో కేవలం వారం రోజులే నితీశ్ సీఎంగా ఉన్నారు. తర్వాత 2005 నుంచి జరిగిన 5 ఎన్నికల్లోనూ ఇతర పార్టీల పొత్తుతో గెలిచి అధికారం చేపట్టారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలతో పలుమార్లు రాజీనామాలు చేశారు. ఇటు NDAతో, అటు MGBతో కలిసి ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలగడం ఆయన స్పెషాలిటీ.