News April 12, 2025
నిర్మల్: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News December 9, 2025
TTD: మెరుగైన సేవలకు అభిప్రాయ సేకరణ

AP: మరింత మెరుగైన సేవల కోసం భక్తుల నుంచి TTD అభిప్రాయాలు సేకరిస్తోంది. IVRS ద్వారా వసతి, అన్నప్రసాదం సహా 17అంశాలపై సమాచారం తీసుకుంటోంది. తిరుమల, తిరుపతిలో పెట్టిన QR కోడ్లను స్కాన్ చేస్తే వచ్చే వాట్సాప్ నంబర్ 93993 99399లోనూ టెక్స్ట్/వీడియో ద్వారా భక్తుల నుంచి సమాచారం తెలుసుకుంటోంది. ప్రతినెల తొలి శుక్రవారం 0877-2263261 నుంచి డయల్ యువర్ EO ద్వారా సమస్యలు వింటూ సేవా నాణ్యత పెంచే ప్రయత్నం చేస్తోంది.
News December 9, 2025
ASF యూత్ కాంగ్రెస్‌కు కొత్త ఇన్ఛార్జ్లు

తెలంగాణ స్టేట్ యూత్ కాంగ్రెస్ సంస్థను బలపరచేందుకు జిల్లా వారీగా అధిష్ఠానం కొత్త ఇన్ఛార్జ్లను నియమించింది. ఆసిఫాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్‌గా రవికాంత్ గౌడ్, సెక్రటరీగా అమ్ముల మధుకర్ యాదవ్‌ను నియమించినట్లు యూత్ కాంగ్రెస్ ప్రకటించింది. యువత చేరిక, బూత్ స్థాయిలో బలోపేతం లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు తెలిపింది.
News December 9, 2025
‘అఖండ-2’ రిలీజ్‌తో 17 సినిమాలపై ఎఫెక్ట్!

బాలయ్య ‘అఖండ-2’ సినిమా ఈనెల 12న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. దీంతో ఈ వారాంతంలో 14 కొత్త, 3 రీరిలీజ్ సినిమాల విడుదల ప్రశ్నార్థకంగా మారింది. ఇవి ఇప్పటికే ప్రమోషన్లు పూర్తిచేసుకున్నా.. బాక్సాఫీస్ వద్ద ‘అఖండ-2’ చూపించే ప్రభావం దృష్ట్యా విడుదలను పోస్ట్‌పోన్ చేసుకుంటున్నాయి. ‘మోగ్లీ’, ‘అన్నగారు వస్తారు’, ‘డ్రైవ్’ వంటి సినిమాల విడుదలకు బాలయ్య మూవీ పెద్ద సవాలుగా మారింది. దీనిపై మీ కామెంట్?


