News April 12, 2025
నిర్మల్: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
Similar News
News July 7, 2025
నస్పూర్: జాతీయస్థాయి పోటీల్లో బంగారు పతకం

హైదరాబాద్‌లో 5 రోజులుగా జరుగుతున్న జాతీయస్థాయి జూనియర్ వుషూ పోటీల్లో నస్పూర్‌కు చెందిన అత్కపురం హాసిని ప్రతిభ కనబరిచి టైలు విభాగంలో బంగారు పథకం సాధించింది. తెలంగాణ SAI ఛైర్మన్ శివసేన రెడ్డి, వైస్ ఛైర్మన్ సోని బాలదేవి చేతులమీదుగా బంగారు పథకాన్ని హాసిని అందుకుంది. క్రీడాకారిణి హాసిని, కోచ్ శివమహేశ్‌ను జిల్లా వుషూ సంఘం ప్రెసిడెంట్ వేముల సతీశ్, జనరల్ సెక్రటరీ రాజనర్సు అభినందించారు.
News July 7, 2025
దండేపల్లి: అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య

అత్తారింటి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన దండేపల్లి మండలం గుడిరేవులో జరిగింది. ఎస్ఐ తహిసోద్దీన్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రూపను భర్త, అత్తమామలు, సమీప బంధువులు వేధింపులకు గురి చేయడంతో ఆమె ఈ నెల 5న గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. రూప తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News July 7, 2025
గవాస్కర్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

ఇంగ్లండ్‌పై భారత్ సాధించిన విజయంలో ఎక్కువ క్రెడిట్ గిల్‌కే ఇవ్వాలి. బ్యాటుతోనే కాకుండా.. కెప్టెన్‌గానూ అద్భుతం చేశారు. విదేశాల్లో అతిపిన్న వయసులో టెస్టు మ్యాచ్ గెలిచిన కెప్టెన్‌గా గవాస్కర్(26Y 198D) పేరిట ఉన్న రికార్డును గిల్(25Y 297D) బద్దలు కొట్టారు. బౌలర్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, వారికి నచ్చిన ఫీల్డ్ సెట్ చేసి సూపర్ విక్టరీ సాధించారు. కచ్చితంగా డ్రా చేస్తామన్న ఇంగ్లండ్‌కు ఓటమి రుచి చూపించారు.