News February 25, 2025

నిర్మల్: ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు

image

మహిళా సాధికారితకు బ్యాంకులు చేయూతను అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. సోమవారం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ నెల 28 వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 17, 2025

మదనాపూర్: కురుమూర్తి స్వామిని దర్శించుకున్న జపాన్ దేశస్థులు

image

దేవరకద్ర నియోజకవర్గంలోని కురుమూర్తి స్వామి దేవస్థానాన్ని సోమవారం ఉదయం జపాన్ దేశస్థులు దర్శించుకున్నారు. వారు స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి వారికి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు.

News November 17, 2025

నెల్లూరు జిల్లాలో 10th విద్యార్థులకు అపార్ గండం

image

విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం 10th విద్యార్థులకు గండంగా మారింది. NEP ప్రకారం విద్యార్థులందరికీ అపార్ గుర్తింపు కార్డు, పర్మినెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ (PEN) ఉండాలి. స్కూల్ రికార్డ్‌లోని వివరాలు, విద్యార్థి ఆధార్ వివరాలు అక్షరం తప్పు లేకుండా సరిపోయిన విద్యార్థులకు APAAR. ID, PEN లభిస్తాయి. అవి ఉంటేనే 10th పరీక్ష ఫీజు చెల్లింపు అవుతుంది. వేల మంది విద్యార్థులకు ఈ ప్రక్రియ ఇంకా పెండింగ్‌లో ఉంది.

News November 17, 2025

అంగన్వాడీ కేంద్రాల ద్వారా బలమైన బాల్యం: సీతక్క

image

బాల్యంలోనే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటే భవిష్యత్తు బలంగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్ఠికాహారం అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలు, బాలింతలకు పుష్ఠికరమైన ఆహార పదార్థాలను అందిస్తున్నామన్నారు. కుళ్లిపోయిన కోడిగుడ్లు, నాసిరకం పాలను సరఫరాచేసే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చంటి పిల్లలు దేవుళ్లతో సమాని, వారిని సంరక్షిస్తామన్నారు.