News March 25, 2025
నిర్మల్: ఈ సమస్యలపైనే కలెక్టర్‌కు ఫిర్యాదులు

ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో జిల్లాలోని ప్రజల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. రైతు రుణమాఫీ, విద్య, వైద్యం, వ్యవసాయం, పింఛన్లు, ధరణి, భూ సమస్యలు, డబుల్ బెడ్ రూమ్, రైతు రుణమాఫీ, తదితర సమస్యలను పరిష్కరించాలని ప్రజలు తమ అర్జీలను సమర్పించారు.
Similar News
News December 6, 2025
గ్లోబల్ డిఫెన్స్ మాన్యుఫాక్చర్ హబ్‌గా ఇండియా

రక్షణ ఉత్పత్తుల తయారీలో గ్లోబల్ హబ్‌గా భారత్ ముందడుగు వేస్తోంది. 2029లో ₹3Tల మేర ఉత్పత్తి చేయడంతో పాటు ₹50,000 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇండియన్ ARMY, NAVY, AIRFORCEకు సంబంధించిన ₹670 Bల ప్రపోజల్‌ను డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదించింది. FY27లో రక్షణరంగ బడ్జెట్ 20% మేర పెరగవచ్చని ఇప్పటికే రక్షణ శాఖ సంకేతాలు పంపింది. దీంతో రక్షణ ఉత్పత్తులు ఊపందుకోనున్నాయి.
News December 6, 2025
VJA: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఇద్దరు వ్యాపారుల పాత్రపై దర్యాప్తు

హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విజయవాడలో ఇద్దరు వ్యాపారుల పేర్లు తెరమీదకి వచ్చాయి. వీరు మావోయిస్టుల మద్దతుదారులా? లేక పోలీసుల ఇన్‌ఫార్మర్లా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.
News December 6, 2025
టాస్ గెలిచిన భారత్

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.
భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.


