News January 11, 2025
నిర్మల్: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

జిల్లా అల్ప సంఖ్యాకవర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రూప్ 1,2,3,4, బ్యాంకింగ్ తదితర పోటీ పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి మోహన్సింగ్ తెలిపారు. మైనారిటీ అభ్యర్థులకు 4నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు శుక్రవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఫిబ్రవరి15లోపు ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్ కార్డు, కుల, ఆదాయధ్రువపత్రాలతో జిల్లా మైనారిటీ అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News December 19, 2025
ADB: ఐటీఐ ముడిసరకు కొనుగోలుకు కొటేషన్ల ఆహ్వానం

ఆదిలాబాద్, ఉట్నూరు ప్రభుత్వ ఐటీఐ సంస్థలకు అవసరమైన వివిధ వృత్తుల ముడిసరకు సరఫరాకు సీల్డ్ కొటేషన్లు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. జీఎస్టీ గుర్తింపు పొందిన సరఫరాదారులు 5 రోజుల్లోగా ప్రిన్సిపల్ కార్యాలయంలోని బాక్సులో కొటేషన్లు అందజేయాలన్నారు. ఆసక్తి గలవారు పూర్తి వివరాల కోసం 9866435005 నంబరును సంప్రదించాలని సూచించారు. నాణ్యమైన సరకు సరఫరా చేసే వారికే ప్రాధాన్యం ఉంటుందన్నారు.
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయితీ వద్దు.. పల్లె ప్రగతే ముద్దు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 1500 పైగా గ్రామాల్లో సర్పంచి ఎన్నికలు జరగగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మద్దతుదారులు స్థానాలు దక్కించుకున్నారు. ఎన్నికలు ముగియడంతో గెలిచినవారు, ఓడినవారు రాజకీయాలు చేస్తూ గ్రామాల అభివృద్ధిని విస్మరించొద్దని ప్రజలు పేర్కొంటున్నారు. అందరూ కలిసి స్థానికంగా నెలకొన్న కుక్కలు, కోతుల బెడద తొలగించాలని.. రోడ్ల, మురుగు కాలువల వంటి అనేక సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు.
News December 19, 2025
ఆదిలాబాద్: పంచాయతీ ఎన్నికలైనా ఆగని జంపింగ్లు

ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిశాయి. బూత్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జోరు కనిపించగా.. ఆదిలాబాద్ నియోజకవర్గంలో కమలం తన బలాన్ని ప్రదర్శించింది. అయితే సర్పంచులుగా గెలిచిన అభ్యర్థులు నిధుల కోసం అధికార కాంగ్రెస్లోకి చేరుతున్నారు. ఇదిలా ఉండగా స్వతంత్రులు, మరికొందరు సర్పంచులు స్థానిక ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉంటే అందులోకి చేరి తమదైన గుర్తింపు పొందే ప్రయత్నాలు చేస్తున్నారు.


