News August 23, 2024

నిర్మల్: ఉపాధి కోసం వెళ్తే.. ఉసురు పోతోంది

image

నిర్మల్ జిల్లా నుంచి గల్ఫ్ దేశాలకు ఎక్కువగా వలస పోతుంటారు. అయితే నిరుద్యోగులుగా వెళ్తున్న కొందరు నిర్జీవంగా తిరిగివస్తున్నారు. జిల్లాలోని 19 మండలాల పరిధిలో సుమారుగా 40 వేల మంది ఉపాధి కోసం గల్ఫ్ బాట పట్టారు. కాగా ఈ ఏడాదిలోనే 20 మంది వివిధ కారణాలతో గల్ఫ్‌లో మరణించడంతో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల భైంసా మండలానికి చెందిన ఇద్దరు మరణించడం ఆందోళన కలిగిస్తోంది.

Similar News

News September 12, 2024

ASF: ‘మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలి’

image

ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని బీసీ యువజన సంఘం జిల్లాధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కోవాలక్ష్మికు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వ్యక్తి, తెలంగాణ తొలి, మలిదశ ఉద్యమంలో పాల్గొని స్వరాష్ట్ర సాధనలో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.

News September 11, 2024

మంచిర్యాలలో వ్యభిచారం

image

మంచిర్యాల పట్టణంలో ఇటీవల వ్యభిచారం కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం పట్టణంలోని ఓ లాడ్జిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు యువతులు, ఇద్దరు బాలికలు, ఆరుగురు విటులతో పాటు నిర్వాహకులను అరెస్ట్ చేశారు. కాగా నిర్వాహకులు భార్యాభర్తలని పోలీసులు వెల్లడించారు.

News September 11, 2024

నిర్మల్: గృహిణి పై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం

image

ఓ గృహిణిపై డెలివరీ బాయ్ అత్యాచారం చేయడానికి ప్రయత్నించిన ఘటన నిర్మల్‌లో మంగళవారం చోటుచేసుకుంది. ఓ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు వచ్చిన డెలివరీ బాయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్న గృహిణి పై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన ఆమె కేకలు వేయగానే పక్కింటి వారు వచ్చేలోపు డెలివరీ బాయ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి నిందితుడు విఘ్నేశ్ (23)ని అరెస్టు చేసినట్లు CI రామకృష్ణ తెలిపారు.