News March 23, 2024
నిర్మల్: ఎన్నికల కోడ్.. నగదు పట్టివేత

నిర్మల్ పట్టణంలోని వివేక్ చౌక్ వద్ద శుక్రవారం రాత్రి పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నిర్మల్ పట్టణానికి చెందిన వంశీ అనే వ్యక్తి బైక్ తనిఖీ చేయగా అతని వద్ద రూ. 2 లక్షల నగదు లభించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నగదుకు సంబంధించి సరైన పత్రాలు లేకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు పట్టణ సీఐ అనిల్ తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పెద్ద మెుత్తంలో నగదును తరలించరాదని తెలిపారు.
Similar News
News December 14, 2025
ఆదిలాబాద్: నేడే పోలింగ్.. మీరు రెడీనా?

జిల్లాలో నేడు జరిగే 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 17 గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలు జరిగే 8 మండలాల్లో ఆదిలాబాద్(R)లో 4, బేల 1, జైనథ్ 1, బోరజ్ 1, భీంపూర్ 5, సాత్నాల 2, తాంసిలో ముగ్గురు సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉ.7గంటల నుంచి మ.1 వరకు పోలింగ్.. మధ్యాహ్నం ఫలితాలు ప్రకటిస్తారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 13, 2025
అలాంటి చర్యలు చేపట్టిన వారిపై చర్యలు: ADB ఎస్పీ

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్, బోరజ్, జైనథ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ కాకుండా గస్తీ నిర్వహించాలన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.
News December 13, 2025
ఆదిలాబాద్: రేపే పోలింగ్.. ఏకగ్రీవమైన పంచాయతీలు ఇవే

ఆదిలాబాద్ జిల్లాలోని 8 మండలాల్లో 2వ విడత పంచాయితీ ఎన్నికల్లో ఇప్పటికే పలు గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. పెద్దమాలే బోరిగాం, అసోద, అల్లికోరి, హత్తిగుట్ట, చాంద్ పల్లి, అడ, పూసాయి, మార్కగూడ, జల్ కోరి, కరుణ్ వాడి, టెక్డి రాంపూర్, భగవాన్ పూర్, పార్డి (బి), జంబుల్ దరి, లింగు గూడ, అట్నమ్ గూడ, అంబుగాం పంచాయతీల్లో సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యాయి. కాగా మావల మండలంలో ఒక్కటి కూడా ఏకగ్రీవం కాలేదు.


