News February 23, 2025

నిర్మల్: ఎన్నికల విధులు నిర్వహించే అధికారులు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులంతా తమ విధుల పట్ల తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధులు నిర్వహించే అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. మాస్టర్ ట్రైనర్లు అధికారులకు ఎన్నికల ముందు, ఎన్నికల సమయంలో, ఎన్నికల తర్వాత నిర్వహించవలసిన విధులపై అధికారులకు శిక్షణ ఇచ్చారు.

Similar News

News January 6, 2026

సంగారెడ్డి: ముందు భార్య.. తర్వాత భర్త సూసైడ్

image

SRD జిల్లాలో <<18772211>>దంపతులు ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. APలోని కర్నూల్ జిల్లా మద్దికేర మం.నికి చెందిన లాల్ శేఖర్(32), అనూష(25) రెండేళ్ల క్రితం బతుకుదెరువు కోసం వచ్చి అమీన్పూర్ పరిధిలో ఐలాపూర్ చిన్నతండాలో ఉంటున్నారు. కొంతకాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. పుట్టింటికి వెళ్లిన భార్య అక్కడ సూసైడ్ చేసుకోగా విషయం తెలిసి భర్త తన ఇంట్లో ఉరేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 6, 2026

సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

<>సౌత్ ఈస్ట్రన్<<>> రైల్వే స్పోర్ట్స్ కోటాలో 54 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు జనవరి 10 నుంచి ఫిబ్రవరి 2వరకు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ ఉత్తీర్ణులై, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడల్లో రాణించినవారు అర్హులు. స్పోర్ట్స్ ట్రయల్స్‌, స్పోర్ట్స్, విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://rrcser.co.in

News January 6, 2026

కోనసీమ: దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌ ఇదే..!

image

ఇరుసుమండ బ్లో అవుట్ నేపథ్యంలో ప్రజలు 1995 నాటి పాసర్లపూడి ఓఎన్‌జీసీ బావి అగ్నిప్రమాద ఘటనను గుర్తు చేసుకుంటున్నారు. దేశ చరిత్రలోనే అతిపెద్ద బ్లోఅవుట్‌గా నమోదైన ఈ మంటలను ఆర్పేందుకు అమెరికా నిపుణుడు నీల్ ఆడమ్స్ బృందం రంగంలోకి దిగింది. అయితే ఓఎన్‌జీసీ అధికారులతో వ్యూహపరమైన విభేదాల వల్ల ఆయన మధ్యలోనే నిష్క్రమించారు. చివరకు 65 రోజుల తర్వాత అంతర్జాతీయ సంస్థల సాయంతో మంటలను అదుపు చేశారు.