News March 12, 2025
నిర్మల్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను త్వరత పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎల్ఆర్ఎస్ (లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుల పరిష్కారంపై పంచాయతీ, మున్సిపల్ అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Similar News
News October 16, 2025
రేపు గుంతకల్లుకు సినీ తారలు

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.
News October 16, 2025
పాత రిజర్వేషన్లతో ‘స్థానిక’ ఎన్నికలు!

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ను అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించింది. దీంతో స్థానిక ఎన్నికలు పాత రిజర్వేషన్ల ఆధారంగానే జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీ ప్రకారం పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు వెళ్లే ఛాన్స్ ఉంది. త్వరలో దీనిపై క్లారిటీ రానుంది.
News October 16, 2025
మొబైల్‌తో వెళ్తే అలాగే కూర్చుండిపోతారు!

మెరుగైన పేగు ఆరోగ్యం కోసం బాత్రూమ్లో ఫోన్ వాడటం ఆపేయాలని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్లు హెచ్చరిస్తున్నారు. ఫోన్ చూస్తూ ఎక్కువసేపు కూర్చుంటే మలసిరలపై ఒత్తిడి పెరిగి పైల్స్ వచ్చే ప్రమాదం 46% వరకు పెరుగుతుందని చెబుతున్నారు. ‘ముఖ్యంగా బాత్రూమ్లో ఫోన్ వాడకండి. ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. హైడ్రేటెడ్‌గా ఉండండి. వెస్ట్రన్ కమోడ్ ఉపయోగిస్తే చిన్న స్టూల్‌పై కాళ్లు ఉంచండి. హ్యాండ్ వాష్ చేసుకోండి ’ అని తెలిపారు.