News April 6, 2025
నిర్మల్: ‘ఎస్ఎస్సీ స్పాట్‌కు రిపోర్ట్ చేయాలి’

పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కోసం నియమించబడ్డ ఏసీఓలు, సీలు, ఏఈలు, స్పెషల్ అసిస్టెంట్లు, క్యాంపు సిబ్బంది సోమవారం ఉదయం 8 గంటల లోపు రిపోర్ట్ చేయాలని డీఈవో రామారావు సూచించారు. అధికారులు 12 గంటలలోపు క్యాంప్ అధికారికి రిపోర్ట్ చేయడంలో విఫలమైతే వారిపై సీసీఏ నియమాల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయన్నారు.
Similar News
News November 16, 2025
ఇండియా-A ఘన విజయం

రాజ్‌కోట్ వేదికగా సౌతాఫ్రికా-Aతో జరిగిన రెండో అనధికార వన్డేలో ఇండియా-A 9 వికెట్ల తేడాతో గెలిచింది. 133 పరుగుల లక్ష్యాన్ని 28 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో రుతురాజ్ (68*) హాఫ్ సెంచరీతో రాణించగా అభిషేక్ 32, తిలక్ 29* రన్స్ చేశారు. ఈ విజయంతో 3 మ్యాచుల సిరీస్‌ను ఇండియా-A 2-0తో సొంతం చేసుకుంది. మూడో అనధికార వన్డే ఈ నెల 19న రాజ్‌కోట్‌లో జరగనుంది.
News November 16, 2025
సిద్దిపేట: నవంబర్ 20న జిల్లా కబడ్డీ ఎంపికలు

సిద్దిపేట జిల్లా జూనియర్, సీనియర్ కబడ్డీ జట్ల ఎంపికలు ఈ నెల 20న ఉదయం 9 గంటలకు జిల్లా కేంద్ర క్రీడా మైదానంలో జరుగుతాయని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కుంటనోళ్ల శివకుమార్ తెలిపారు. జూనియర్ బాలికలు(డిసెంబర్ 29, 2005 తర్వాత జననం – 65 కేజీల లోపు), బాలురు (జనవరి 18, 2006 తర్వాత జననం – 70 కేజీల లోపు) అర్హులని ఆయన పేర్కొన్నారు.
News November 16, 2025
CII సదస్సు విజయవంతం: రాజన్

విశాఖపట్నం వేదికగా జరిగిన CII సదస్సు విజయవంతమైనట్లు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు రాజన్ తెలిపారు. చిత్తూరులోని పార్టీ ఆఫీసులో ఆదివారం మాట్లాడారు. ఏపీలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఏపీ పారిశ్రామిక హబ్‌గా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో MP ప్రసాదరావు, ఎమ్మెల్యేలు నాని, మురళీమోహన్ ఎమ్మెల్సీ శ్రీకాంత్ పాల్గొన్నారు.


