News May 2, 2024

నిర్మల్: కాంగ్రెస్‌లో చేరిన కౌన్సిలర్

image

నిర్మల్ పట్టణంలోని 27, 39వ వార్డులకు చెందిన కౌన్సిలర్ దంపతులు తౌహీద్దీన్, ఆయేషా గురువారం సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. గతంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా గెలిచారు. మాజీమంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మీద ఉన్న అభిమానంతో బీఆర్ఎస్‌లో చేరారు. అల్లోల కాంగ్రెస్‌లో చేరడంతో తిరిగి వారు కూడా కాంగ్రెస్‌లో చేరారు.

Similar News

News February 9, 2026

గ్రీవెన్స్ డే ఫిర్యాదులపై స్పందించాలి: ADB SP

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌ డేలో SP అఖిల్ మహాజన్ బాధితుల నుంచి 13 ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, భూ తగాదాలు, పెండింగ్ కేసులపై స్పందించిన ఆయన.. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలు తమ ఫిర్యాదులు, సమాచారాన్ని 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపవచ్చని సూచించారు.

News February 9, 2026

ADB: ముగిసిన ప్రచారం.. మూగబోయిన మైకులు

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. మైకులు మూగబోవడంతో ఒకసారిగా పట్టణంలో వాతావరణం ప్రశాంతంగా మారింది. చివరి రోజున రాజకీయ నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. గత రెండు వారాలుగా ఎన్నికల ప్రచారంతో గల్లీలో సందడి వాతావరణం కనిపించింది. ఏ వీధి చూసిన ప్రచార హోరు కనిపించింది. మరోవైపు సాయంత్రం 5గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి.

News February 9, 2026

ఎన్నికల కౌంటింగ్ పారదర్శకంగా నిర్వహించాలి: ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ మున్సిపాలిటీ సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నిర్వహించాలని కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని దిశానిర్దేశం చేశారు. పోలింగ్‌తో పాటు కౌంటింగ్ ప్రక్రియ కూడా అత్యంత కీలకమని, కౌంటింగ్ సిబ్బందికి ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.