News March 21, 2024
నిర్మల్: కారు దిగేందుకు సిద్ధం!
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..BRS నాయకులు ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతుండటంతో ఆ ప్రభావం నిర్మల్ జిల్లాలో కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే ఇంద్రకరణ్ రెడ్డితో పాటు విఠల్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతున్నారని ప్రచారం సాగుతోంది. జిల్లాలో కాంగ్రెస్, BJP బలంగా ఉండటంతో ఈ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ నిర్మల్ మున్సిపల్ మాజీ ఛైర్మన్ గణేశ్ చక్రవర్తి, BRS కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు BRSను వీడనున్నారు.
Similar News
News September 13, 2024
నిర్మల్ : సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలి: కలెక్టర్
సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవలసిన చర్యలపై మండలాల వారీగా వైద్య ఆరోగ్య, పంచాయతీరాజ్ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ పనితీరును మరింతగా పటిష్టపర్చలన్నారు.
News September 12, 2024
జైనూర్ బాధితురాలిని పరామర్శించిన బీఎస్పీ ఎంపీ
జైనూర్‌లో ఇటీవల ఆదివాసీ మహిళపై అత్యాచారం జరగగా బాధితురాలు సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా బాధితురాలిని ఆదిలాబాద్ బీఎస్పీ పార్లమెంట్ ఇన్‌ఛార్జ్ జంగు బాబుతో కలిసి బీఎస్పీ రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
News September 12, 2024
నిర్మల్: అన్నను నరికి చంపిన తమ్ముడు
అన్నను తమ్ముడు దారుణంగా హత్య చేసిన ఘటన నిర్మల్‌లో చోటుచేసుకుంది. పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన శంభు(35)ను కుటుంబ కలహాల కారణంగా అతడి తమ్ముడు శివ గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. సమాచారం అందుకున్న డీఎస్పీ గంగారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.