News July 18, 2024

నిర్మల్: కొడుకు మరణాన్ని తట్టుకోలేక తల్లి మృతి

image

కుమారుడు మృతి చెందడంతో గుండెపోటుతో తల్లి మృతి చెందిన ఘటన లక్ష్మణ్‌చందా మండలంలో చోటుచేసుకుంది. రాచాపూర్ గ్రామానికి చెందిన బక్కన్న, ఎర్రవ్వలకు ఓ కుమారుడు, ముగ్గరు కుమార్తెలు. కుమారుడు సాయన్న(40) అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఈనెల 13న మృతి చెందాడు. దీంతో మనోవేదనకు గురైన అతడి తల్లికి గుండెపోటు వచ్చింది. కుటుంబీకులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

Similar News

News December 13, 2024

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధరల వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో శుక్రవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,521గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,960గా నిర్ణయించారు. గురువారం ధరతో పోలిస్తే శుక్రవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పులేదు. ప్రైవేట్ పత్తి ధర రూ.20 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

News December 13, 2024

మంచిర్యాల: అండర్- 14 ఉమ్మడి బాలుర క్రికెట్ జట్టు ఎంపిక

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో మంచిర్యాలలో ఉమ్మడి జిల్లా అండర్-14 క్రికెట్ జట్టు ఎంపిక జరిగింది. కోచ్ ప్రదీప్ క్రీడాకారుల ప్రతిభను గుర్తించి జట్టును ప్రకటించారు. మంచిర్యాల నుంచి లక్ష్మణ్ సాయి, అర్జున్ రిషికేశ్ చందర్, జహీర్, సాత్విక్ ఎంపికయ్యారు. ఈనెల 16న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంటుంది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన వారిని పలువురు అభినందించారు.

News December 13, 2024

ADB: ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్

image

ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సంబంధిత అధికారులతో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి మొబైల్ యాప్ ద్వారా నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి సర్వే ప్రక్రియను ఈ నెల డిసెంబర్ చివరి నాటికి ఎలాంటి తప్పులు దొర్లకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వేను ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పక్కాగ చేయలన్నారు.