News February 11, 2025
నిర్మల్: కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అర్హులైన లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. సోమవారం మధ్యాహ్నం నుంచి మీ సేవలు కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధిదారులు దరఖాస్తులు చేసుకున్నారు. పట్టణంలోని 14 మీసేవ కేంద్రాల్లో మండలాలలో వేర్వేరు కేంద్రాల్లో దరఖాస్తులు చేస్తుండటంతో రద్దీ పెరిగింది. కొత్త కుటుంబాల వారే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది.
Similar News
News October 22, 2025
HYD: తెలుగు వర్శిటీ.. క్రికెట్ జట్టు కెప్టెన్లు వీరే!

సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు వర్శిటీలో క్రికెట్ టోర్నీ బుధవారం నిర్వహిస్తున్నట్లు వర్శిటీ స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ ఆర్.గోపాల్ Way2Newsతో తెలిపారు. జట్టు సారథులను ఎంపిక చేశామన్నారు.1.TU డెవిల్స్ జట్టు కెప్టెన్గా అమీర్ 2.TU సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్గా ముస్తాక్ 3.TU ఛాలెంజర్స్ జట్టు కెప్టెన్గా వినోద్ 4.TU వారియర్స్ జట్టు కెప్టెన్గా ప్రవీణ్ 5.TU ది డామినేటర్స్ జట్టు కెప్టెన్గా అరుణ్
News October 22, 2025
నేటి నుంచి కార్తీక వైభవం

శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం నేడు ప్రారంభం కానుంది. ‘న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం!! న తీర్థం గంగాయాస్థమమ్’ అని స్కంద పురాణంలో ఉంది. అంటే కార్తీకానికి సమానమైన మాసము, కేశవుడికి సమానమైన దేవుడు, వేదముతో సమానమైన శాస్త్రం, గంగతో సమానమైన తీర్థము లేదు అని అర్థం. ఈ మాసంలో చేసే పూజలు, వ్రతాలు, ఉపవాసాలు శుభప్రదం. * రోజూ ఆధ్యాత్మిక కంటెంట్ కోసం <<-se_10013>>భక్తి<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 22, 2025
ఉయ్యూరు: బాలికపై మేనమామ అత్యాచారం

బాలికపై మేనమామ వరసయ్యే వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన ఘటన ఉయ్యూరులో మంగళవారం జరిగింది. మద్యం మత్తులో 10 సంవత్సరాల బాలికపై చాంద్ బాషా అత్యాచారయత్నానికి పాల్పడగా.. బాలిక కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు గమనించి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం బాషాను పోలీసులకు అప్పగించారు. అయితే తనపై నిన్న చాంద్ బాషా అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదయింది.