News April 6, 2025
నిర్మల్: కోర్టును ప్రారంభించిన హైకోర్టు జడ్జి

జిల్లా కేంద్రంలోని ప్రధాన కోర్టు ఆవరణంలో కోర్ట్ ఆఫ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కమ్ -2 జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆప్ ఫస్ట్ క్లాస్ కోర్టును శనివారం హైకోర్టు జడ్జ్ జస్టిస్ లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువలో ఉండటానికి ఈ కోర్టును ప్రారంభించినట్లు తెలిపారు. జిల్లా ప్రధాన జడ్జి కర్ణ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లారెడ్డి, జడ్జిలు, న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News September 16, 2025
రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా ‘మిరాయ్’

తేజా సజ్జ నటించిన ‘మిరాయ్’ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్ల దిశగా దూసుకెళ్తోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.91.45 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు మూవీ యూనిట్ తెలిపింది. మొదటి 3 రోజుల్లో రూ.81.2 కోట్లు, నిన్న రూ.10.25 కోట్లు కలెక్ట్ చేయడం గమనార్హం. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్, శ్రియ కీలక పాత్రలు పోషించారు.
News September 16, 2025
మెనోపాజ్లో ఈ ఆహారం తీసుకుంటే మేలు!

ప్రతి మహిళకు మెనోపాజ్ దశ తప్పనిసరి. 40 ఏళ్లు దాటిన తర్వాత హార్మోన్ల మార్పుల కారణంగా అనేక మార్పులొస్తాయి. అలసట, బరువు పెరగడం, హెయిర్లాస్ మొదలవుతాయి. కాబట్టి విటమిన్ డీ, కే, కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే ఫుడ్స్, ప్రొటీన్ కోసం చికెన్, గుడ్లు, చేపలు తినాలి. వీటితో పాటు గోధుమ, బ్రౌన్ రైస్, బార్లీ, ఓట్స్, క్వినోవా, పండ్లు, ఆకుకూరలు, ఈస్ట్రోజన్ పెరగడానికి నువ్వులు, అవిసెలు, బీన్స్ డైట్లో చేర్చుకోవాలి.
News September 16, 2025
అరకు: ‘కాఫీ బెర్రీ బోరర్ సమస్య అదుపులోకి వచ్చినట్లే’

కాఫీ బెర్రీ బోరర్ కీటకం సమస్య అదుపులోకి వచ్చినట్లేనని అరకు ఉద్యానశాఖ అధికారిణి శిరీష తెలిపారు. అరకు, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో సుమారు 33 పంచాయతీల్లో 105 గ్రామాల్లో 5,176 ఎకరాల్లో సర్వే చేసి, 150 ఎకరాల్లో కీటకం సోకినట్లు గుర్తించామన్నారు. ఆయా తోటల్లో కాఫీ పంటను మొత్తం కోసి, ఉడకబెట్టి, భూమిలో పాతిపెట్టడం జరిగిందన్నారు. బెర్రీ బోరర్పై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని, రైతులు సహకరించాలని కోరారు.