News February 5, 2025

నిర్మల్: గల్ఫ్ బాధితుల కోసం హెల్ప్ లైన్ నంబర్ ఇదే..!

image

గల్ఫ్ బాధితులకు సహాయాన్ని అందించేందుకై జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గల్ఫ్ బాధితుల కోసం, వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేసేందుకు జిల్లాలో హెల్ప్ లైన్ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధితుల కుటుంబ సభ్యులు 9398421883 నంబరులో సంప్రదించి తమ సమస్యలను తెలపాలన్నారు.

Similar News

News February 24, 2026

ఆదిలాబాద్ AIRPORTపై కలెక్టరేట్‌లో సమీక్ష

image

ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతిపాదిత ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌పై సమన్వయ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా అధ్యక్షతన జరిగిన ఈ సమావేషంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, MP నగేశ్ పాల్గొన్నారు. భూ సేకరణకు సంబంధించిన సవాళ్లు, మాస్టర్ ప్లాన్ పరిధిలో వివిధ శాఖలు ప్రతిపాదించిన అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రాజెక్టు కారణంగా ప్రభావితమయ్యే ఆస్తులు, రహదారులు భవనాలపై మాట్లాడారు.

News February 24, 2026

జగిత్యాల: DGP ఎదుట లొంగిపోయిన దేవ్ జీ

image

జగిత్యాల(D) కోరుట్లకి చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ 4 దశాబ్దాల <<19214963>>అజ్ఞాత జీవితం<<>> అనంతరం లొంగిపోయాడు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లా మంథని మండలం శాస్త్రపల్లి గ్రామానికి చెందిన మల్లా రాజిరెడ్డి మంగళవారం HYDలో తెలంగాణ DGP శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీపై రూ.25 లక్షల నగదు బహుమతి, మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌పై కూడా రూ. 25 లక్షల రివార్డును ఖరారు చేశారు.

News February 24, 2026

ఆదిలాబాద్: ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

image

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్‌ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కనపర్తి చంద్రకాంత్, కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.