News April 13, 2025

నిర్మల్: గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ఫ్రీ డ్రెస్

image

రాబోయే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తుల వస్త్రం జిల్లాకు చేరిందని డీఈవో రామారావు తెలిపారు. జిల్లాలోని 48,874 మంది విద్యార్థులకు సంబంధించిన ఏకరూప దుస్తుల వస్త్రం రెండు జతలకు సంబంధించి రావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ఒక జతకు సంబంధించిన ఏకరూప దుస్తుల వస్త్రం వచ్చిందని చెప్పారు. జిల్లాలోని 19 మండలాలకు రెండు రోజుల్లో సరఫరా చేస్తామన్నారు.

Similar News

News December 20, 2025

KNR: శాతవాహన వృక్షశాస్త్ర విద్యార్థుల క్షేత్ర పర్యటన

image

శాతవాహన విశ్వవిద్యాలయంలో వృక్షశాస్త్ర విద్యార్థులు శైవలాల సేకరణలో భాగంగా దిగువ మానేరు డ్యామ్‌ను వృక్షశాస్త్ర విభాగాధిపతి డా.సాయిని కిరణ్ ఆధ్వర్యంలో సందర్శించారు. ఇందులో భాగంగా శైవలాల సేకరణ ఏ విధంగా చేయాలి, ఏ విధంగా భద్రపరచాలి, వాటి యొక్క ఆర్థిక ప్రాముఖ్యతను తెలియజేస్తూ క్షేత్ర పర్యటన లక్ష్యాలను, శైవలాల ఆవశ్యకతను అధ్యాపకులు డా. అభినేష్, డా.శివకుమార్ విద్యార్థులకు వివరించారు.

News December 20, 2025

SRCL: ‘ఫర్టిలైజర్ యాప్‌పై అవగాహన కల్పించాలి’

image

రైతులు ఎరువుల కోసం పడే ఇబ్బందులు దూరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ఫర్టిలైజర్ యాప్‌పై విస్తృత అవగాహన కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. ఫర్టిలైజర్ యాప్‌పై అవగాహన, ఆయిల్ పామ్ లక్ష్యం తదితర అంశాలపై జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు, పీఏసీఎస్ సీఈఓలతో సమీక్ష సమావేశం కలెక్టర్ కార్యాలయంలోని ఆడిటోరియంలో శనివారం నిర్వహించారు.

News December 20, 2025

ALERT: ఈ వేరుశనగలు తింటే లివర్ క్యాన్సర్!

image

బూజు పట్టిన వేరుశనగలు తినడం ప్రాణాంతకమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘వీటిలో ఉండే అఫ్లాటాక్సిన్ B1 అనే విషపూరిత రసాయనం కాలేయ కణాలను దెబ్బతీస్తుంది. ఇది శరీరంలోకి చేరితే తీవ్రమైన లివర్ ఫెయిల్యూర్‌కు దారితీయడమే కాకుండా, DNAను మార్పు చేసి భవిష్యత్తులో కాలేయ క్యాన్సర్ వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఆహార నిల్వ విషయంలో అప్రమత్తంగా ఉంటూ రంగు మారిన, బూజు పట్టిన గింజలను పారేయాలి’ అని సూచిస్తున్నారు. SHARE IT