News February 9, 2025
నిర్మల్: గురుకుల విద్యార్థినిని అభినందించిన ప్రధాని

సోఫీ నగర్ బాలికల గురుకుల పాఠశాలకు చెందిన పదవ తరగతి విద్యార్థిని ఎస్ వర్షితకు అరుదైన గౌరవం దక్కింది. 2024 సెప్టెంబర్ మాసంలో జాతీయస్థాయిలో నిర్వహించిన ప్రయోగాత్మక నైపుణ్య అభివృద్ధి భారత నిర్మాణంలో 5 మౌలిక సూత్రాలపై నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని ప్రజెంటేషన్ ఇచ్చినందుకుగాను ఇచ్చినందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురుకుల విద్యార్థి హర్షితకు హర్షితకు లేఖ పంపారు.
Similar News
News February 12, 2026
భూపాలపల్లి: మొదలు కానున్న క్యాంపు రాజాకీయం..?

మున్సిపల్ పోలింగ్ ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో కౌంటింగ్‌పై రాజకీయ పార్టీలు దృష్టిపెట్టాయి. ఓట్లలెక్కింపు ప్రక్రియముగిసిన వెంటనే గెలిచిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాలన్న యోచనలో ఆయా రాజకీయ పార్టీల నేతలు ఉన్నారు. ఈమేరకు అవసరమైన ఏర్పాట్లు చేసేపనిలో నిమగ్నమయ్యారు. గెలిచిన వారివద్ద మొబైల్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఈమేరకు క్యాంపులకు సంబంధించిన ఏర్పాట్లు, రూట్ మ్యాప్, వాహనాలను సిద్ధంచేస్తున్నారు.
News February 12, 2026
నిన్నటి సంఘటన బాధ అనిపించింది: స్పీకర్ అయ్యన్న

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుండగా వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తూ పత్రాలు చించివేయడం బాధనిపించిందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం శాసనసభలో ఆయన మాట్లాడారు. విద్యార్థులను అసెంబ్లీ సమావేశాలకు ఆహ్వానించామని, ఈ నేపథ్యంలో వారికి శాసనసభ్యులపై చులకన భావం ఏర్పడుతుందన్నారు. సభ గౌరవాన్ని దిగజార్చే హక్కు మనకు లేదన్నారు. ప్రజలు మన నడవడికను గమనిస్తుంటారని తెలుసుకోవాలన్నారు.
News February 12, 2026
MBNR: మహాశివరాత్రికి ఆర్టీసీ స్పెషల్ బస్సులు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం MBNR ఆర్టీసీ రీజియన్ భారీ ఏర్పాట్లు చేసింది. ఈనెల 13 నుంచి 16 వరకు ఉమ్మడి జిల్లా నుంచి శ్రీశైలానికి 304 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు RM సంతోష్ కుమార్ తెలిపారు. MBNR డిపోల నుంచి 72, NGKL 53, వనపర్తి 47, గద్వాల 34, అచ్చంపేట 28, NRPT 23, కొల్లాపూర్ 22, కల్వకుర్తి 16, షాద్‌నగర్ నుంచి 9, శివరాత్రి రోజు 153 స్పెషల్ బస్సులు నడుపుతున్నారు.


