News February 24, 2025

నిర్మల్: చిన్నారిపై కుక్కల దాడి

image

నిర్మల్‌లో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. చైన్ గేట్ ప్రాంతంలో నివాసముండే హంజాఖాన్(7) సోమవారం సాయంత్రం ఇంటి వద్ద ఆడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా అతడిపై కుక్కలు దాడి చేయడంతో ముఖం, చేతులకు తీవ్రగాయాలైనట్లు కుటుంబీకులు తెలిపారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకొని కుక్కల బెడదనుంచి కాపాడాలని కోరారు.

Similar News

News November 14, 2025

నేను టీటీడీ ఉద్యోగిని కాను: రవి కుమార్

image

పరకామణి చోరీ కేసులో సీఐడీ విచారణ, రవికుమార్ ఆస్తులు, కుటుంబసభ్యుల ఆస్తులపై ఏసీబీతో విచారణ చేయాలనే హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేయాలని రవికుమార్ వాజ్యం వేశారు. సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరకామణి వ్యవహారంలో సుమోటో వ్యాజ్యంను మేమే విచారిస్తామని సీజే బెంచ్ తెలిపింది. అయితే నేను టీటీడీ ఉద్యోగిని కాను, నిర్వచనం పరిధిలోకి రాను, ఏసీబీ విచారణ ఆపాలని కోరారు.

News November 14, 2025

BRSకు స్వల్ప ఆధిక్యం

image

జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మూడో రౌండ్‌లోని ఒక EVMలో BRSకు స్వల్ప ఆధిక్యం వచ్చింది. మూడో రౌండ్‌లో ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్ ఓట్లను లెక్కించారు. అటు ఇప్పటివరకు 3 రౌండ్లలో కలిపి చూస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ లీడ్‌లో ఉంది.

News November 14, 2025

కెనరా బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>కెనరా<<>> బ్యాంక్ సెక్యూరిటీస్ లిమిటెడ్ 10 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు. డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణులై, NISM/NCFM సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.canmoney.in/careers