News February 19, 2025
నిర్మల్: జాతీయ రహదారిపై బైకు కారు ఢీ ఒకరి మృతి

మండలంలోని భాగ్యనగర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. కిషన్ రావు పేట చెందిన ఆత్మరామ్(55), అతని కొడుకు శ్రీకాంత్ భాగ్యనగర్ వద్ద బైక్ పై వస్తుండగా ఆర్మూర్ నుంచి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి వీరిని ఢీకొట్టింది. దీంతో ఆత్మరామ్ అక్కడికక్కడే మృతిచెందగా శ్రీకాంత్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News November 14, 2025
PDPL: మహిళా సంఘాల బలోపేతానికి కలెక్టర్ కీలక ఆదేశాలు

మహిళా సంఘాలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష శుక్రవారం ఆదేశించారు. సెర్ఫ్ కార్యకలాపాల సమీక్షలో ఆమె మాట్లాడుతూ.. ప్రతి సంఘం ఆదాయ మార్గాలు పెంచాలని, బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. స్త్రీనిధి రుణాల పంపిణీలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచినందుకు కలెక్టర్ అభినందించారు. నాణ్యతతో ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు.
News November 14, 2025
పోషకాహారం లక్ష్యంగా ముందుకు: కలెక్టర్ రాజర్షి షా

విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారం అందించే లక్ష్యంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్ మండలం మన్నూర్ పీఎం శ్రీ జడ్పీ ఉన్నత పాఠశాలలో ఆయన న్యూట్రీ గార్డెన్, ఆర్వో వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఉపాధి హామీ పథకం అమలులో భాగంగా మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్, డీఆర్డీఓ రవీందర్, మండల ప్రత్యేక అధికారి తదితరులు పాల్గొన్నారు.
News November 14, 2025
BRS కంచుకోటను బద్దలు కొట్టిన న‘విన్’

హైదరాబాద్ అంటే BRS.. BRS అంటే హైదరాబాద్ అని ఆ పార్టీ నేతలు గొప్పగా చెప్పుకుంటారు. కానీ, జూబ్లీ బైపోల్లో కాంగ్రెస్ విజయంతో గులాబీ కంచుకోట బీటలువారింది. ఎగ్జిట్ పోల్స్లో అంచనాలను మించి నవీన్ యాదవ్ భారీ మెజార్టీని సాధించారు. ఏ ఒక్క రౌండ్లో BRS ఆధిక్యం చూపలేకపోయింది. సిటీలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేయడం విశేషం. న‘విన్’తో రాజధానిలో హస్తానికి మరింత బలం పెరిగింది.


