News February 19, 2025
నిర్మల్: జాతీయ రహదారిపై బైకు కారు ఢీ ఒకరి మృతి

మండలంలోని భాగ్యనగర్ ఎక్స్ రోడ్ వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్సై లింబాద్రి తెలిపారు. కిషన్ రావు పేట చెందిన ఆత్మరామ్(55), అతని కొడుకు శ్రీకాంత్ భాగ్యనగర్ వద్ద బైక్ పై వస్తుండగా ఆర్మూర్ నుంచి అతివేగంగా వస్తున్న కారు వెనుక నుంచి వీరిని ఢీకొట్టింది. దీంతో ఆత్మరామ్ అక్కడికక్కడే మృతిచెందగా శ్రీకాంత్ గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
Similar News
News April 10, 2026
ప్రతి గింజను కొంటాం.. వారంలోపే నగదు జమ: పొంగులేటి

రాష్ట్రవ్యాప్తంగా రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. కూసుమంచి మండలం చేగొమ్మలో గోదామును ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొన్న వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని తెలిపారు. ధరణితో రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులను తొలగించి, ‘భూ భారతి’ ద్వారా సుపరిపాలన అందిస్తున్నామని పేర్కొన్నారు.
News April 10, 2026
కడప: యువతి గొంతు కోసి హత్య

కడప జిల్లా ఖాజీపేట పట్టణంలో దారుణం జరిగింది. అగ్రహారం ఏరియాకు చెందిన యువతిని ఓ యువకుడు గొంతు కోశాడు. చికిత్స నిమిత్తం కడపకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. నిందితుడు కొట్టాలు గ్రామానికి చెందిన డిగ్రీ సెకండ్ ఇయర్ యువకుడి(19)గా గుర్తించారు. తనను పెళ్లి చేసుకోలేదని ప్రేమోన్మాదిగా మారి మర్డర్ చేశాడని తెలుస్తోంది. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సమాచారం.
News April 10, 2026
గుంటూరు కలెక్టర్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్..!

గుంటూరు కలెక్టర్ అధికారిక ఫేస్‌బుక్ పేజీ District Collector Guntur మాత్రమే అని అధికారులు వెల్లడించారు. CM Saikanth Varma las పేరుతో ఉన్నది నకిలీ అకౌంట్‌గా గుర్తించినట్లు తెలిపారు. ప్రజలు గమనించి మోసపోవద్దని, ఆ అకౌంట్‌ను అనుసరించవద్దని సూచించారు. అనుమానాస్పద అకౌంట్లపై వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఫేక్ ఐడీలపై అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.


