News January 21, 2025

నిర్మల్ జిల్లాకు 10,500 ఇందిరమ్మ ఇళ్లు: కలెక్టర్

image

అర్హులైన వారికే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున నిర్మల్, ఖానాపూర్, ముధోల్ మూడు నియోజకవర్గాలకు కలిపి జిల్లావ్యాప్తంగా మొత్తం 10,500 మంజూరు చేయనునట్లు ఆమె తెలిపారు. ఇందుకోసం ఈనెల 24 వరకు గ్రామ, వార్డు సభలను నిర్వహిస్తున్నామన్నారు.

Similar News

News February 19, 2025

బజార్హత్నూర్‌లో మృతదేహం లభ్యం

image

బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 

News February 19, 2025

ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

image

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

News February 19, 2025

ADB: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

image

ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.

error: Content is protected !!