News March 24, 2025
నిర్మల్ జిల్లాకు 1,27,748 జవాబు పత్రాలు : DEO

మూల్యాంకన విధులను పారదర్శకంగా నిర్వహించాలని డీఈవో రామారావు అన్నారు. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఆదివారం సీసీఓలు, ఏసీవోలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నిర్మల్ జిల్లాకేంద్రంలోని సెయింట్ థామస్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్షలకు సంబంధించిన స్పాట్ వాల్యూవేషన్ క్యాంప్ ఉంటుందన్నారు. మూల్యాంకన విధులు పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు. దాదాపు 1,27,748 జవాబు పత్రాలు జిల్లాకు చేరుతాయని తెలిపారు.
Similar News
News December 6, 2025
దశలవారిగా జోగులాంబ ఆలయ అభివృద్ధి

ఐదో శక్తిపీఠంగా విరాజిల్లుతున్న అలంపూర్ జోగులాంబ ఆలయాన్ని దశలవారీగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. శుక్రవారం సచివాలయంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ సమీక్ష నిర్వహించి, ఆలయ అభివృద్ధికి రూ.347 కోట్లు అవసరమని అంచనా వేశారు. మొదటి దశలో రూ.138.40 కోట్లు, రెండో దశలో రూ.117.60 కోట్లు, మూడో దశలో రూ.91 కోట్లు ఖర్చు చేస్తారు.
News December 6, 2025
NLG: DCCలకు పరీక్ష

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి పరీక్షను DCC అధ్యక్షులు ఎదుర్కొంటున్నారు. నవంబర్ 22న ఉమ్మడి జిల్లాలో NLG DCC అధ్యక్షుడిగా పున్నా కైలాస్ నేత, BNG DCC అధ్యక్షుడిగా బీర్ల ఐలయ్య, సూర్యాపేట అధ్యక్షుడిగా గుడిపాటి నరసయ్యను నియమించారు. కొత్తగా నియమితులైన వారి పని తీరును ఆరు నెలల పాటు పరిశీలిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు. GP ఎన్నికల్లో ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని వారిలో టెన్షన్ పట్టుకుంది.
News December 6, 2025
ఖమ్మం: సర్పంచ్ బరిలో ఐపీఎస్ అధికారి తల్లి

ఎర్రుపాలెం మండలంలోని నూతనంగా ఏర్పడిన విద్యానగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కోట వజ్రమ్మ బరిలోకి దిగారు. బీహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న కోట కిరణ్ కుమార్ తల్లిగా వజ్రమ్మ ప్రత్యేక గుర్తింపు పొందారు. గతంలోనూ సర్పంచ్గా పనిచేసిన అనుభవం కలిగిన ఆమె, 620 ఓట్లున్న విద్యానగర్లో మరోసారి విజయం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


